ENGLISH

అనుష్క కూడా పెళ్ళి కబురు చెప్పబోతోందా.?

08 October 2020-10:05 AM

పెళ్ళి కబురుతో కాజల్‌ అగర్వాల్‌ పెద్ద షాకే ఇచ్చింది. అక్టోబర్‌ 30న కాజల్‌ అగర్వాల్‌ పెళ్ళి, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో జరగనున్న విషయం విదితమే. తాజాగా మరో తార పెళ్ళి కుబురు గురంచి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో గాసిప్స్‌ షికార్లు చేస్తున్నాయి. జేజెమ్మ అనుష్క శట్టిె త్వరలో పెళ్ళి పీటలెక్కబోతోందట. అనుష్క గత కొంతకాలంగా ఓ వ్యక్తితో ప్రేమలో వుందనీ, ఆ విషయాన్ని ఆమె రహస్యంగా వుంచుతోందనీ గాసిప్స్‌ వినిపిస్తున్న విషయం విదితమే. అయితే, అనుష్క మాత్రం ‘ప్రేమ లాంటిదేమీ లేదు.. నేనూ పెళ్ళి చేసుకుంటా.. కానీ, అదెప్పుడో చెప్పలేను.. దానికి టైవ్ు రావాలి..’ అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

 

కానీ, ఇంతలోనే అనుష్క పెళ్ళికి సమాయత్తమయ్యిందనే గాసిప్‌ హాట్‌ హాట్‌గా ప్రచారంలోకి వచ్చింది. వరుడు బెంగళూరుకి చెందిన వ్యక్తి అట. ఫ్యామిలీ ఫ్రెండ్‌ కావడంతో అనుష్క, అతనితో పెళ్ళికి ‘సై’ అనేసిందట. నవంబర్‌లో అనుష్క పెళ్ళి జరగబోతోందని తాజా గాసిప్స్‌ సారాంశం. అయితే, ఈ విషయాన్ని అనుష్క ధృవీకరించాల్సి వుంది. ఇదిలా వుంటే, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఓటీటీలో బాగానే సౌండ్‌ చేస్తోంది. మొదటి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. ఓటీటీలో సినిమాని బాగానే ఆదరిస్తున్నారట ఆడియన్స్‌. కాగా, తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తున్నానన్న అనుష్క, ఆ సినిమాల వివరాల్ని త్వరలోనే వెళ్ళడిస్తానంటోంది.

ALSO READ: Anushka Latest Photoshoot