ENGLISH

ఒక‌టి కాదు.. రెండు కాదు.. మూడు!

08 October 2020-09:00 AM

అక్టోబ‌రు 23 ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రెబ‌ల్ స్టార్ అభిమానుల కోసం బోల్డ‌న్ని గిఫ్టులు త‌యార‌వుతున్నాయి. `రాధేశ్యామ్‌` టీజ‌ర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజర్ విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం రెడీ అయిపోయింద‌ట‌. అక్టోబ‌రు 23న టీజ‌ర్ రావ‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం.

 

దాంతో పాటు... `ఆది పురుష్‌`కి సంబంధించిన ఓ స‌ర్‌ప్రైజ్ అదే రోజున రాబోతోంది.ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రన్న విష‌యంలో ఆరోజు క్లారిటీ రావొచ్చ‌ని చెబుతున్నారు. ప్ర‌భాస్ చేతిలో ఉన్న మ‌రో సినిమా వైజ‌యంతీ మూవీస్‌ది. దీనికి నాగ అశ్విన్ ద‌ర్శ‌కుడు. ఈసినిమాకి సంబంధించిన అప్ డేట్ ప్ర‌భాస్ పుట్టిన రోజున చెప్ప‌బోతున్నార్ట‌. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది... ప్ర‌భాస్ పుట్టిన రోజున చెప్పేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్ర‌భాస్ పుట్టిన రోజు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా మార‌బోతోంద‌న్న‌మాట‌.

ALSO READ: Prabhas, Prabhas Birthday, Radhe Shyam, Adipurush, Prabhas Nag Ashwin

ALSO READ: https://telugu.iqlikmovies.com/viewnews/bollywood-drugs-case-diverted/16419