ENGLISH

అనుష్క వర్సెస్‌ పూజ.. పోటీలో గెలిచేదెవరు.?

11 October 2020-13:30 PM

క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ ‘శాకుంతలం’ అనే సినిమాని అనౌన్స్‌ చేసిన విషయం విదితమే. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా అనుష్కని తీసుకోవాలంటూ డిమాండ్లు జోరందుకుంటున్నాయి. అనుష్క పేరు ఖాయమైపోయిందన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే, నటీనటుల వివరాలు ఇంతవరకు గుణశేఖర్‌ ప్రకటించలేదు. కాగా, ఈ సినిమా కోసం మరో హీరోయిన్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, పూజా హెగ్దే. అనుష్కతో పోల్చితే పూజా హెగ్దే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌.. అని పూజ అభిమానులు అంటున్నారు. నిజమే, పూజా హెగ్దే బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతోంది.

 

ఈ నేపథ్యంలో ఆమెకు ‘శాకుంతలం’లో ఛాన్స్‌ వస్తే, అది ఆ ప్రాజెక్ట్‌కి కూడా అడ్వాంటేజ్‌ అవుతోంది. అనుష్కకి వున్న ఫాలోయింగ్‌, ఆమె ఇమేజ్‌ని తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే, అనుష్క మీద 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసినా, అది సేఫ్‌ ప్రాజెక్ట్‌ అయ్యేంతటి క్రేజ్‌ ఆమె సొంతం. కానీ, పరిస్థితులు మారాయి. అనుష్క కూడా రెగ్యులర్‌గా సినిమాలు చేయడంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తోంది.

 

ఈ నేపథ్యంలో పూజా హెగ్దే వైపే గుణశేఖర్‌ మొగ్గు చూపొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ‘శాకుంతలం’ కథ ఏంటో ఎవరికీ తెలియదు. ఈలోగా పూజా హెగ్దే హీరోయిన్‌.. అనుష్క హీరోయిన్‌.. అంటూ ప్రచారమేంటో అర్థం కావడంలేదన్నది గుణశేఖర్‌ సన్నిహితుల వాదనగా కనిపిస్తోంది.

ALSO READ: మెగాస్టార్‌ చిరంజీవి ‘రాంగ్‌ స్టెప్‌’ వేస్తున్నారట.