ENGLISH

కాజ‌ల్ - గౌత‌మ్‌.. స్కూల్ మేట్సా..?

07 October 2020-10:03 AM

కాజ‌ల్ పెళ్లి గౌత‌మ్ అనే వ్యాపార వేత్త‌తో ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈనెల 30న ముంబైలో వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. కాజ‌ల్ కాబోయే భ‌ర్త‌గా గౌత‌మ్ పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో.. అస‌లు గౌత‌మ్ ఎవ‌రు? ఏం చేస్తాడు? కాజ‌ల్ తో ఎప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది? ఈవిష‌యాల్ని తెలుసుకోవాల‌న్న ఆసక్తి అంద‌రిలోనూ మొద‌లైంది. గౌత‌మ్ ఓ బిజినెస్ మేన్‌. డిసెర్న్ లివింగ్ అనే సంస్థ‌ను న‌డుపుతున్నాడు. కాజ‌ల్ - గౌత‌మ్ ల పాత ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

గౌత‌మ్‌కీ - కాజ‌ల్ కి ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంద‌న్న సంగ‌తి ఆ ఫొటోలే చెబుతున్నాయి. నిజానికి గౌత‌మ్ - కాజ‌ల్ స్కూల్ మేట్స్ అని తెలుస్తోంది. ఇద్ద‌రూ ఒకే స్కూల్ లో చ‌దువుకున్నార‌ని స‌మాచారం. ఆ స్నేహం క్ర‌మ‌క్ర‌మంగా ప్రేమ గా మారింద‌ని, గ‌త ఐదారేళ్ల నుంచి ఇరు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. సో.. ఈబంధం ఈనాటిది కాద‌న్న‌మాట‌.

ALSO READ: ఆర్ఆర్ఆర్‌’ ఎంత నష్టం జరిగిందంటే..