ENGLISH

ఆర్ఆర్ఆర్‌’ ఎంత నష్టం జరిగిందంటే..

07 October 2020-09:01 AM

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యింది. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడగా.. ఇటీవల లాక్‌డౌన్‌ నుంచి లభించిన మినహాయింపుల నేపథ్యంలో.. అన్ని చర్యలూ తీసుకుని, నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌ మొదలు పెట్టారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఈ ఇద్దరూ షూటింగ్‌కి హాజరయ్యారు. సినిమా కోసం వేసిన భారీ సెట్టింగులు.. సినిమా కోసం రూపొందించిన అత్యద్భుతమై కాస్ట్యూమ్స్.. ఇంకా చాలా చాలా అంశాలన్నిటినీ ఓ వీడియోలో ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్ బయటకు వదిలింది.

 

‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ఎంత పెద్దదో, కరోనా కారణంగా వచ్చిన నష్టమేంటో ఈ వీడియోతో అందరికీ అర్థమయిపోతోంది. సెట్‌ ప్రాపర్టీ అంతా క్లీన్‌ చేసుకోవడానికే రోజుల తరబడి సమయం పట్టేలా వుంది. కాస్ట్యూమ్స్ సంగతి సరే సరి. వాటిల్లో చాలావరకు వృధా అయిపోయి వుండొచ్చు. ఎలా చూసుకున్నా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాకి కరోనా కారణంగా చాలా నష్టం వాటిల్లింది. మిగతా సినిమాల పరిస్థితీ దాదాపు ఇదే. కానీ, ‘ఆర్ఆర్ఆర్‌’కి మరింత ఎక్కువ నష్టం వాటిల్లిందన్నది నిర్వివాదాంశం.

 

ఏడెనిమిది నెలల సమయం అంటే చిన్న విషయం కాదు. దీన్ని భర్తీ చేయడమంటే అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. రాజమౌళి ఏదో అద్భుతం చేయాల్సిందే. ఆ అద్భుతం ఎలా వుంటుందన్నది ముందు ముందు తేలుతుంది. 2021లో ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరిస్తుందా.? వేచి చూడాల్సిందే.

ALSO READ: ‘గబ్బర్‌సింగ్‌’ నా లైఫ్‌ని మార్చిన సినిమా: శృతిహాసన్‌!