ENGLISH

మోనాల్‌ కోసం పులిహోర.. మిగతావాళ్ళ పరిస్థితేంటి?

06 October 2020-18:00 PM

బిగ్‌బాస్‌ రియాల్టీ షో అంతా ‘మోనాల్‌ కోసం పులిహోర’ కలపడంతోనే సరిపోతోంది. హౌస్‌లో ఇంకో టాపిక్‌ లేదా.? అనేంతగా మోనాల్‌ గజ్జర్‌ చుట్టూ తిరుగుతున్నారు కంటెస్టెంట్స్‌ అబిజీత్‌, అఖిల్‌. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, చాలామంది కంటెస్టెంట్స్‌.. మోనాల్‌ చుట్టూనే నడవాల్సి వస్తోంది.. కారణం వున్నా, లేకున్నా. బహుశా ఇదంతా బిగ్‌బాస్‌ స్క్రీన్‌ప్లే అయి వుండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న జరిగిన నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో మోనాల్‌ గజ్జర్‌ చుట్టూనే కథ నడిచింది. ఈ క్రమంలో పెద్దయెత్తున గొడవ చెలరేగింది.

 

ఈ రోజు మళ్ళీ వ్యవహారమంతా చచ్చుబడిపోయినట్లుంది. మోనాల్‌తో మళ్ళీ అబిజీత్‌, అఖిల్‌ ముచ్చట్లు మొదలు పెట్టారు. ‘నిన్ను కార్నర్‌ చేయడం మా ఉద్దేశ్యం కాదు’ అంటూ విడివిడిగా సంజాయిషీ ఇచ్చుకున్నారు. ‘నామినేషన్‌ నా కోసం కాదు’ అని మోనాల్‌ మళ్ళీ కుళాయి తిప్పేసింది. ఆ సందడేంటో ఈ రోజు ఎపిసోడ్‌లో చూడొచ్చు. కానీ, ఈ డ్రామా అంతా చూస్తున్న బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి వెగటుపుట్టేస్తోంది. హౌస్‌లో ఒక రోజంతా చాలా విషయాలు జరుగుతాయి.

 

అయితే, కేవలం నామినేషన్‌ ఎపిసోడ్‌ ఒక్కటీ హైలైట్‌ చేసేసి ఊరుకున్నారు నిన్నటి ఎపిసోడ్‌లో. అవినాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఆశిస్తున్నారు.. హారిక నుంచి ఏదో ఆశిస్తున్నారు.. అమ్మ రాజశేఖర్‌ డాన్సులు, గంగవ్వ ముచ్చట్లు, జోర్‌దార్‌ సుజాత కబుర్లు.. ఇలా చాలా సంగతుంటాయి. అవేవీ కనిపించకుండా బిగ్‌బాస్‌, ‘పులిహోర’ కలుపుతుండడం కొంత వింతగానే అనిపిస్తోంది.

ALSO READ: పూరి 'ఇస్మార్ట్‌' స్టెప్‌