2014 ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ మద్దతుతోనే టీడీపీ గెలిచింది. ఎమ్మెల్యే బాలకృష్ణ గెలుపులోనూ పవన్ పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఓటేయడంతోనే ఎమ్యెల్యేగా బాలయ్య గెలిచారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇది అక్షర సత్యం.
అలాంటిది బాలయ్య, పవన్ కళ్యాణ్‌ని అలా అనేశారేంటి.? అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు కలిసి భారీగా అవినీతికి పాల్పడ్డారు.. అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా బాలయ్య స్పందించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అనవసరంగా ఆయన్ని హీరోని చేయడం నాకిష్టం లేదు అని బాలయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలిసింది 'అభివృద్ధి' ఒక్కటే. అందుకోసం మేం ఎంతవరకూ అయినా కష్టపడతాం. అయితే అది ఓర్వలేక ఎవరెవరో, ఏవేవో విమర్శలు చేస్తుంటారు. వాటిని మేం అస్సలు పట్టించుకోం అని అంటూ బాలయ్య పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి పై విధంగా స్పందించారు.
అయితే మరి ఇదే బాలయ్యకు గతంలో ఆ హీరో పవన్ కళ్యాణ్ మద్దతే ఎందుకు కావాల్సి వచ్చింది. అప్పుడు ఆ హీరో మద్దతుతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు 'అభివృద్ది' అనే నీతి వాక్యాలు బోధిస్తున్నానన్న విషయాన్ని ఎలా మర్చిపోయావయ్యా బాలయ్యా. శనివారం అనంతపురం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలయ్య విలేఖరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానాలు ఇచ్చి ఇదిగో ఈ విధంగా ఇరుక్కున్నారన్న మాట.
ALSO READ: 'కిరాక్ పార్టీ' ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్