ENGLISH

అవునా! శ్రియ పెళ్లయిపోయిందా?

17 March 2018-15:40 PM

ముద్దుగుమ్మ శ్రియ పెళ్లి విషయంలో గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రియ పెళ్లయిపోయిందంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరగుతోంది. అయితే ఇది నిజమో కాదో తెలీదు కానీ, శ్రియ పెళ్లి అయితే అయిపోయిందనే తెలుస్తోంది. 

ఎందుకంటే ఈ మధ్య శ్రియ పెళ్లి చేసుకోబోతోందంటూ పుకార్ల తర్వాత నిజమైన వార్తలు కూడా వచ్చాయి. రష్యా పారిశ్రామిక వేత్త, క్రీడాకారుడు అయిన ఆండ్రూ కొచ్చీవ్‌తో శ్రియ గతకొంత కాలంగా ప్రేమలో ఉందనీ, త్వరలోనే శ్రియ ఆయన్ని వివాహమాడబోతోందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలే ఇప్పుడు నిజమయ్యాయనిపిస్తోంది. మార్చి 12న శ్రియ వివాహం జరిగిందనీ, అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో శ్రియ వివాహం జరిగిందనీ తెలుస్తోంది. అంతేకాదు శ్రియ పెళ్లి రోజు వేసుకున్న కాస్ట్యూమ్స్‌ వివరాలు కూడా చర్చకు వస్తున్నాయి. 

అయితే ఇంతవరకూ ఈ విషయంపై శ్రియ నుండి అధికారిక క్లారిటీ రాలేదు. అయినా శ్రియకు అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేముందంటూ మరో పక్క ఆమె అభిమానులు భావిస్తున్నారు. దశాబ్ధకాలానికి పైగానే శ్రియ సినిమాల్లో నటిగా కొనసాగుతోంది. ఎంతమంది కుర్రభామలు పోటీ వచ్చినా, శ్రియకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. 

హీరోయిన్‌గానే కాకుండా, ఐటెం గాళ్‌గానూ, హుందా అయిన గెస్ట్‌ రోల్స్‌లోనూ శ్రియ సత్తా చాటింది. సీనియర్‌ హీరోస్‌తో పాటు, యంగ్‌ హీరోస్‌తో కూడా శ్రియ ఆడి పాడింది. మొదటి సినిమా 'ఇష్టం' దగ్గర నుండీ, ఫిజిక్‌ని పర్‌ఫెక్ట్‌గా కాపాడుకుంటూ వచ్చింది శ్రియ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గాయత్రి' సినిమాలో విష్ణుకి జోడీగా నటించింది శ్రియ. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది.

ALSO READ: కిరాక్ పార్టీ మొదటిరోజు కలెక్షన్స్