ENGLISH

బాలయ్య - రోజా జోడీ కుదిరేనా?

23 January 2020-11:00 AM

సాధ్యమయ్యే విషయమా? ఇది అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, ఓ మీటింగ్‌లో బాలయ్య - రోజా పక్క పక్కన కూర్చొని అందమైన సెల్ఫీకి పోజిచ్చారు. ఈ సెల్ఫీనే ఇప్పుడీ తాజా చర్చకు దారి తీస్తోంది. గతంలో హీరో, హీరోయిన్‌గా బాలయ్య - రోజా ఓ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. కానీ, ఇప్పుడు భిన్న పార్టీలకు చెందిన రాజకీయ నాయకీ, నాయకులు వీరిద్దరూ. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య. అలాంటిది వీరి కాంబినేషన్‌ సెట్టింగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూడడమా? ఎందుకు కాకూడదు, సినిమా వేరు, రాజకీయం వేరు.

 

రాజకీయాల్లో బిజీగా ఉంటూనే బాలయ్య బాబు వరుసపెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటప్పుడు రోజా ఎందుకు నటించకూడదు.? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆహ్లాదంగా నవ్వుతూ పోజిచ్చిన ఈ సెల్ఫీ చూస్తే, ఆడియన్స్‌లో ఓ కొత్త కోరిక మెరిసింది. వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కితే ఎలా ఉంటుంది.? అని. ఇటీవలే సీనియర్‌ హీరోయిన్‌ విజయ శాంతి సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. సో ఆ లెక్కల్లో చూసుకుంటే, రోజా కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తే బావుంటుందనీ, ఆ ఎంట్రీ బాలయ్య సినిమాతో జరిగితే ఇంకా బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు.

 

అయితే, బాలయ్య సరసన హీరోయిన్‌గా రోజాకి ఛాన్స్‌ ఉందా? లేదా? అనే విషయం పక్కన పెడితే, సీనియర్‌ హీరోయిన్స్‌ కోసం కాంబినేషన్‌ క్యారెక్టర్లు, పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లు చాలానే పుట్టుకొస్తున్నాయిప్పుడు. అలా అభిమానుల కోరిక మన్నించి, బాలయ్య - రోజా కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్‌ స్టోరీని సిద్ధం చేస్తారేమో మన ప్రియమైన రైటర్లు చూడాలి మరి.

ALSO READ: అల్లు ఇంట్లో విషాదం