ENGLISH

విడుదలకు ముందే రికార్డ్ సృష్టించిన 'భరత్ అనే నేను'

17 March 2018-15:05 PM

మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం వచ్చే నెల 20వ తేదీన  ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ చిత్రం విడుదల కాక ముందే రికార్డులు సృష్టిస్తున్నది.

ఇక ఆ రికార్డు విషయానికి వస్తే, భరత్ అనే నేను టీజర్ కి యుట్యూబ్ లో అత్యధికంగా 5 లక్షల పైన లైక్స్ వచ్చాయి. దాదాపు ఈ స్థాయిలో ఒక టీజర్ కి రావడం ఒక రికార్డు అని చెప్పుకుంటున్నారు. అలాగే భరత్ అనే నేను టీజర్ కి ఇప్పటికే 13 మిలియన్ హిట్స్ వచ్చాయి.

ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం ఒక ప్లస్ అని ఇప్పటికే మంచి టాక్ ఉండడంతో భరత్ అనే నేను పైన క్రేజ్ విపరీతంగా ఉంది. ఇక వచ్చే నెల మొదటి నుండి ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకి చేరువకానుంది.

బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి ఫ్లాపుల తరువాత వస్తున్న భరత్ అనే నేను చిత్రం పైన మహేష్ అభిమానులకి భారీ అంచనాలే ఉన్నాయి.

 

ALSO READ: ‘చరణ్’ అంటే ఎక్కువ అంటున్న హీరో