ENGLISH

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన శివాజీ

17 March 2018-14:35 PM

హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరోకన్నా ఒక రాజకీయ నాయకుడిగా బాగా పాపులర్...

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆయన విమర్శలు గుప్పించాడు. దీనితో ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ తో పాటుగా విమర్శలు కూడా ఎదరయ్యాయి.

ఇంతకి ఆ విమర్శలు చేసింది మరెవరో కాదు హీరో శివాజీ. పవన్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేయడం సరికాదు అని అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి వెనుకాడింది కేంద్ర ప్రభుత్వం అని గుర్తుచేశాడు. అలాగే ఎక్కువ ధర గల భూమిని గుంటూరు సమీపంలో తక్కువ ధరకి కొనడం కూడా అవినీతి క్రిందకే వస్తుంది అని.

అట్లాంటప్పుడు ఇంకొకరి అవినీతి గురించి ఎలా ప్రశ్నిస్తారు అని పవన్ కళ్యాణ్ కి ఎదురు ప్రశ్న వేశాడు. అలాగే విమర్శలు, పోరాటం సరైన పంధాలో చేయాలనీ సూచనలు సైతం చేశాడు.

మరి ఈ విమర్శలకి పవన్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

 

ALSO READ: ‘చరణ్’ అంటే ఎక్కువ అంటున్న హీరో