ENGLISH

‘చరణ్’ సినిమాకి కైరా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

17 March 2018-13:36 PM

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత హీరోయిన్లకి చక్కగా సరిపోతుంది. ఈ సామెతని నూటికినూరుపాళ్ళు తన కెరీర్ పరంగా అమలు చేస్తున్నది నటి కియరా అద్వాని.

ప్రస్తుతం కియారా అద్వాని చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ భరత్ అను నేను అలాగే తాజాగా రామ్ చరణ్-బోయపాటి కలయికలో రానున్న చిత్రం. ఇక రెండవ చిత్రానికి రెమ్యునరేషన్ పరంగా మొదటి చిత్రానికి తీసుకున్న దానికి డబల్ అంటే సుమారు రూ 1 కోటి డిమాండ్ చేసినట్టు సమాచారం. 

ఇది తెలిసిన ట్రేడ్ పండితులు మాత్రం కెరీర్ లో ఈ మాత్రం ముందుచూపు లేకపోతే కష్టం అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో రామ్ చరణ్ తో సినిమా అంటేనే టాప్ హీరోయిన్ అన్నట్టు అర్ధం కాబట్టి రెమ్యునరేషన్ ఆ స్థాయిలో డిమాండ్ చేయడం సమంజసమే అని అన్నవారు కూడా లేకపోలేదు. 

మరి ఈ రెండు హిట్ అయితే ఇక ఆమె రెమ్యునరేషన్ కి రెక్కలు వచ్చినట్టే...

 

ALSO READ: సల్మాన్ ఖాన్ భార్య అంటూ హంగామా