ENGLISH

సల్మాన్ ఖాన్ భార్య అంటూ హంగామా

17 March 2018-13:34 PM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట నిన్న పెద్ద హంగామా నడిచింది. దీనితో మీడియా మొత్తం ఆయన ముంబైలో నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్ మెంట్స్ చుట్టూ గుమిగూడింది. 

వివరాల్లోకి వెళితే, ఒక గుర్తుతెలియని మహిళ తనని తాను సల్మాన్ ఖాన్ భార్య అంటూ చెప్పుకుంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని తప్పించుకుని ఆ బిల్డింగ్ పైకి వెళ్ళింది. వెళ్ళడమే కాకుండా సల్మాన్ ఖాన్ నా భర్త అంటూ కేకలు వేయడం, తనని క్రిందకిదించడానికి ప్రయత్నిస్తే దూకేస్తాను అని బెదిరించింది.

దీనితో ఫైర్ సిబ్బంది వారు అతి కష్టం మీద ఆ యువతిని క్రిందకి దించడం జరిగింది. ఆమె ఎవరు? ఏంటి? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక సల్మాన్ ఖాన్ కోసం అప్పుడప్పుడు కొందరు మహిళా అభిమానులు ఇటువంటి చర్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం.

ఏదేమైనప్పటికీ సల్మాన్ ఖాన్ పెళ్ళి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

 

ALSO READ: ప్రముఖ గాయకుడికి జైలు శిక్ష