రవితేజ ఇదివరకటి ఫామ్‌లోకి వచ్చేసినట్లే ఉన్నాడు పరిస్థితులు చూస్తుంటే. వరుస పెట్టి సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఏడాదికి మూడు, అంతకుమించి సినిమాలతో అభిమానులను ఎంటర్‌టైన్ చేసే హీరో రవితేజ. అలాంటి గత రెండేళ్లుగా రవితేజ కెరీర్ స్లో అయిపోయింది. దాదాపు రెండేళ్లు పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. దాంతో ఈ ఏడాది రవితేజ ఫుల్‌గా జోరు పెంచేశాడు.
ఆల్రెడీ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు రవితేజ. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా. రవితేజ అంటే మాస్ ఊర మాస్. ఆ స్థాయికి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతోందట. అందుకే ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇది కాక శీను వైట్ల దర్శకత్వంలో రవితేజ మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'అమర్ అక్బర్ ఆంటోనీ' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయంలో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో రవితేజతో జత కడుతోంది.
ఇదిలా ఉంటే, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న వి.ఐ ఆనంద్, రవితేజకు ఓ స్టోరీ వినిపించాడట. ఆ స్టోరీ రవితేజకు తెగ నచ్చేసిందట. దాంతో ఆ సినిమాకి రవితేజ ఓకే చెప్పేశాడనీ సమాచారమ్. ఇలా ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తూ, మూడో సినిమాని లైన్‌లో పెట్టేసిన రవితేజ ఇంకో కొత్త స్క్రిప్టు ఓకే చేశాడనీ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అదే సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా ఆట. గతంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ తెరకెక్కాల్సి వుంది. కానీ కుదరలేదు. అది ఇప్పటికి కుదిరిందట.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌నీ పట్టాలెక్కించేందుకు రవితేజ సంసిద్ధంగా ఉన్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి రవితేజతో జత కట్టే అవకాశాలున్నాయి.
ALSO READ: ప్రముఖ గాయకుడికి రెండేళ్ళ జైలు