ENGLISH

కమల్‌ సినిమాకి లైన్‌ క్లియర్‌

17 March 2018-12:34 PM

ఇటీవలే రాజకీయ రంగ ప్రవేశం చేసి, కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, ప్రజలతో మమేకమవుతున్న కమల్‌ హాసన్‌, మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారా? అంటే అవునంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి వచ్చాక, ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్లే అనుకున్నారంతా. 

అయితే ముందుగానే కమిట్‌ అయిన 'భారతీయుడు 2' ప్రాజెక్ట్‌ ఒకటి కమల్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమాని అతి త్వరలోనే కమల్‌ పట్టాలెక్కించనున్నారట. రాబోయే ఎలక్షన్స్‌లోగా ఈ సినిమాని పూర్తి చేసి విడదల చేయాలనే యోచనలో కమల్‌ ఉన్నట్లు తాజా సమాచారమ్‌. ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం శంకర్‌ 'రోబో 2.0' గ్రాఫిక్స్‌ పనులతో బిజీగా ఉన్నారు. ఈ గ్రాఫిక్స్‌ దాదాపు చివరి దశకు చేరుకున్నాయట. ఇక '2.0' కూడా విడుదలకు ముస్తాబవుతోంది. దాంతో నెక్స్ట్‌ శంకర్‌, కమల్‌హాసన్‌తో 'భారతీయుడు' సీక్వెల్‌కి రంగం సిద్ధం చేయనున్నాడట. 

ప్రస్తుతం కమల్‌ నటించిన 'విశ్వరూపం 2' విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్‌ బోర్ట్‌ యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. 2013లో విడుదలైన 'విశ్వరూపం' సినిమా వివాదాల నడుమ విడుదలై, సంచలన విజయాన్ని అందుకుంది. అంతకు మించిన సక్సెస్‌ 'విశ్వరూపం 2' దక్కించుకుంటుందని చిత్ర యూనిట్‌ నమ్మకం వ్యక్తం చేస్తోంది. 

ఈ సినిమాలో కమల్‌ సరసన పూజా కుమార్‌, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు.

ALSO READ: ప్రముఖ గాయకుడికి రెండేళ్ళ జైలు