'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కీర్తి సురేష్. తొలి సినిమా నుండే యాక్టింగ్ టాలెంట్‌తో దూసుకెళ్లిపోతూ, చాలా తక్కువ టైంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. అందుకే ప్రెస్టీజియస్ మూవీ అయిన అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' చిత్రంలో లీడ్ రోల్ పోషించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది.
మొదట్లో ఈ చిత్రం కోసం ఎంతో మంది సీనియర్ నటీమణుల్ని పరిశీలించారు. సమంత, నిత్యామీనన్ తదితర ముద్దుగుమ్మల్ని పరిశీలించి, చివరకు ఆ ప్లేస్‌లో కీర్తి సురేష్‌ని ఎంచుకోవడం జరిగింది. అంటే ఆమె యాక్టింగ్ టాలెంట్‌పై ఎంత నమ్మకముందో చిత్ర యూనిట్‌కి అర్ధం చేసుకోవచ్చు. ఆ నమ్మకాన్ని ఈ బ్యూటీ నిలబెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోందట. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాలోనిదంటూ ఓ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఆ ఫోటో చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది కాదు. ఆ సంగతి పక్కన పెడితే, ఇటీవల ఓ సందర్భంలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ని ఎంచుకోవడం సబబు కాదనీ సీనియర్ నటి జమున వ్యాఖ్యానించారు. దాంతో కీర్తి సురేష్‌పై ఆ పాత్రను మరింత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన భారీ బాధ్యత పడింది. ఇకపోతే, అలా వ్యాఖ్యానించిన ఆ సీనియర్ నటి జమున పాత్రలో సమంత నటిస్తోంది. ఇంకా భారీ కాస్టింగ్ ఈ సినిమాకి ఎంచుకోవడం జరిగింది.
ఇటీవలే ఎన్టీఆర్ పాత్రకు నాగచైతన్యను ఎంచుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పాత్రల వివరాలు తప్ప ఈ సినిమా నుండి ఇంకా ఒరిజినల్ ప్రచార చిత్రాలేమీ విడుదల కాలేదు. త్వరలోనే 'దర్శిని' పేరుతో 'మహానటి' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ALSO READ: కిరాక్ పార్టీ తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్