ENGLISH

నాగ్ కోసం ప్ర‌త్యేక విమానం

07 October 2020-12:00 PM

నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభంకాబోతోంది. అయితే... ఇక్క‌డే ఓ చిక్కు వ‌చ్చి ప‌డింది. ఈ సినిమా షూటింగ్ కి బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారు. క‌నీసం రెండు వారాల పాటు షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఈ రెండు వారాలూ... నాగ్ బిగ్ బాస్ కి దూరం కావాల్సి వ‌స్తుంది. బిగ్ బాస్ నిర్వాహ‌కుల కోరిక మేర‌కు.. నాగ్ ఇప్పుడు షూటింగ్ ని బ్యాంకాక్ నుంచి కులుమ‌నాలికి షిఫ్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

 

అంతే కాదు... శ‌ని, ఆదివారాలు షూటింగ్ లేకుండా చూసుకోబోతున్నాడ‌ట‌. అందుకోసం నాగ్ కి ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేయ‌నున్నారు. కులు మ‌నాలి నుంచి.. హైద‌రాబాద్ కి నాగ్ ప్రైవేట్ జెట్ లో రాబోతున్నాడు. రెండు వారాల పాటు.. నాగ్ హైద‌రాబాద్ టూ కులుమ‌నాలి ట్రావెల్ చేస్తూనే ఉంటాడ‌న్న‌మాట‌. మొత్తానికి బిగ్ బాస్ కి డుమ్మా కొట్ట‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడ‌న్న‌మాట‌.

ALSO READ: కాజ‌ల్ - గౌత‌మ్‌.. స్కూల్ మేట్సా..?