ENGLISH

గంగవ్వతో అవినాష్‌ని బ్యాలెన్స్‌ చేశావా బిగ్‌బాస్‌.!

03 October 2020-15:00 PM

బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో ఏదీ ‘రియలిస్టిక్‌’గా కనిపించడంలేదన్న విమర్శలు కొనసాగుతూనే వున్నాయి.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా ‘రియాల్టీ’ అన్న ఆలోచనని వ్యూయర్స్‌కి రాకుండానే చేస్తున్నారు. తాజాగా బిగ్‌హౌస్‌లో ఫ్యాషన్‌ షో నడిచింది. ఇందులో ఫిమేల్‌ కంటెస్టెంట్స్‌ నుంచి గంగవ్వని విన్నర్‌గా ప్రకటిస్తే, మేల్‌ కంటెస్టెంట్స్‌ నుంచి అవినాష్‌ని సెలక్ట్‌ చేశారు. ఇదెక్కడి న్యాయం.? అంటూ అబిజీత్‌, అఖిల్‌ సార్ధక్‌, సోహెల్‌, కుమార్‌ సాయి, నోయెల్‌ సీన్‌.. ఇలా మేల్‌ కంటెస్టెంట్స్‌ మద్దతుదారుల నుంచీ, అలాగే దివి, అలేఖ్య హారిక, మోనాల్‌ గజ్జర్‌ మద్దతుదారుల నుంచీ ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.

 

గత సీజన్లలో కూడా ఇలాంటివి జరిగినా, అప్పట్లో ఎలాంటి ‘పక్షపాతం’ చూపలేదు. ఇప్పుడు మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. కాయిన్స్‌ టాస్క్‌లో గంగవ్వని పక్కన పెట్టేశారు. అవినాష్‌ కాలికి గాయంతో సైడ్‌ అయిపోయాడు. ఆయా పోటీల్లోంచి ఏదో ఒక కారణంతో కంటెస్టెంట్లను పక్కన పెడితే పోటీలో మజా ఎలా వుంటుంది.? పైగా, విజేతగా గంగవ్వని పలు సందర్భాల్లో ప్రకటిస్తుండడం.. ఆమెకు ఎలాంటి పోటీ వుండకపోవడంతో మిగతా కంటెస్టెంట్స్‌ అభిమానులు వర్రీ అవుతున్నారు. దీన్ని రియాల్టీ షో అనలేమనీ, ఓ సాధారణ టీవీ సీరియల్‌లా భావించలేకపోతున్నామని బిగ్‌బాస్‌ అభిమానులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా, తాను చేస్తున్న కామెడీ పట్ల కంటెస్టెంట్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేయడాన్ని భరించలేకపోతున్నాడు అవినాష్‌, ‘నాకు ఇలాంటి టాస్క్‌లు ఇవ్వొద్దు బిగ్‌బాస్‌’ అని అవినాష్‌ వేడుకుంటుండడం గమనార్హం.

ALSO READ: అభిమాని సాహ‌సం.. బ‌న్నీ ఫిదా