ENGLISH

గ్లామ్‌షాట్‌: జిల్‌ జిల్‌ జిగేల్‌ 'బిప్స్‌' మెరుపుల్‌.!

08 January 2020-18:30 PM

బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు కుర్రకారులో ఓ సెన్సేషన్‌. ఇప్పుడు ఈ భామ సినిమాలకు దూరంగా ఉందనుకోండి. పెళ్లి చేసుకుని పర్సనల్‌ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. అప్పుడప్పుడూ వెకేషన్‌ సంగతుల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తానింకా యాక్టివ్‌గానే ఉన్నా.. అంటూ ఫ్యాన్స్‌కి గుర్తు చేస్తుంటుంది. తాజాగా అలాగే వెకేషన్‌ మూడ్‌లో ఉన్న కొన్ని ఫోటోలు తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది బిపాసా బసు. బీచ్‌ ఒడ్డున ఓ స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతున్న దృశ్యాలవి. అప్పుడే జలకాలాడి అలసిపోయి, పూల్‌ కార్నర్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నట్లుగా ఫోటోకి పోజిచ్చింది బిపాసా బసు. 

బ్యాక్‌ గ్రౌండ్‌లో సముద్రపు అలలు, పూల్‌లో బికినీ తడి పొడి సొగసుల్లో ఉన్న బిప్స్‌. ఆ అలల్ని, అందాల భామ సొగసుల్ని ముద్దాడుతున్నట్లు కనిపిస్తున్న వినీల ఆకాశం.. బ్లూ అండ్‌ బ్లూ లొకేషన్‌ అద్భుతమైన ఫీల్‌ ఇస్తోంది. ఈ అరుదైన హాట్‌ పోజులో బిప్స్‌ని చూసి ఫ్యాన్స్‌ అహో అందాల భామ.. ఈ అందాల్ని మిస్‌ అవుతున్నామే.. అని పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ హాట్‌ బ్యూటీ గతంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సరసన 'టక్కరి దొంగ' సినిమాలో తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే.

ALSO READ: Bipasha Basu Hot Photoshoot