ENGLISH

చరణ్‌, ప్రబాస్‌ తర్వాత విజయ్‌కే ఆ ఛాన్స్‌.!

07 January 2020-07:30 AM

తన స్టైలింగ్‌తో యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. చాలా కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో విజయ్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ మాటికొస్తే, విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ ప్యాన్‌ ఇండియా లెవల్‌లోనే ఉందని చెప్పాలేమో. అందుకే ఆ ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి త్వరలో డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ సన్నాహాలు చేస్తున్నాడు. పూరీ జగన్నాధ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో 'ఫైటర్‌' మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా దక్షిణాది భాషలతో పాటు, బాలీవుడ్‌లో కూడా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌తో కలిసి, పూరీ, ఛార్మి ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ప్రత్యేకమైన లుక్స్‌లో మేకోవర్‌ కానున్నాడట. ఇప్పటికే ఆయన చేస్తున్న 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రం షూటింగ్‌ ఓ కొలిక్కి రావడంతో, తదుపరి సినిమా 'ఫైటర్‌' మేకోవర్‌ కోసం సిద్ధమవుతున్నాడు. అందుకోసం విదేశాలకు వెళ్లనున్నాడట విజయ్‌. ప్రత్యేకమైన హెయిర్‌ స్టైల్‌ చేయించుకోనున్నాడట. విజయ్‌ స్పెషల్‌ హెయిర్‌ స్టైల్‌ కోసం ప్రముఖ బాలీవుడ్‌ స్పెషల్‌ హెయిర్‌ స్టైలిష్ట్‌ ఆలిమ్‌ హకీం వర్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ ఆలిమ్‌ హకీం మన టాలీవుడ్‌ హీరోలైన ప్రబాస్‌, చరణ్‌లకు హెయిర్‌ స్టైలిష్ట్‌గా వర్క్‌ చేశారు. ఆ తర్వాతి స్థానం ఇప్పుడు విజయ్‌ దేవరకొండ దక్కించుకోవడం విశేషం. ఫిబ్రవరిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ సౌత్‌ ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ALSO READ: 'మా' వివాదంపై స్పందించిన రామ్‌చరణ్‌!