ENGLISH

అప్పుడు బాపుబొమ్మ.. ఇప్పుడు బుట్టబొమ్మా సంపేశాడంతే.!

09 January 2020-07:30 AM

త్రివిక్రమ్‌కి మంచి మ్యూజిక్‌ టేస్ట్‌ ఉందన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో పాటలన్నీ సూపర్‌ హిట్సే. దగ్గరుండి మరీ మ్యూజిక్‌ కంపోజ్‌ చేయించుకుంటాడు త్రివిక్రమ్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో చేసిన 'జల్సా', 'అత్తారింటికి దారేది' తదితర చిత్రాలతో పాటు, ఏ హీరోతో త్రివిక్రమ్‌ సినిమా చేసినా ఆ సినిమాలో మ్యూజిక్‌ ఆల్బమ్‌ సూపర్‌ హిట్టే అనడం అతిశయోక్తి కాదేమో. లేటెస్ట్‌గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో..' సినిమా మ్యూజిక్‌ ఆల్బమ్‌ కూడా అంతే హిట్‌. ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేస్తున్నాయి.

 

ముఖ్యంగా 'బుట్టబొమ్మా..' సాంగ్‌ అయితే వెంటాడేస్తోంది. నిజంగానే ఆ పాటలో పూజా హెగ్దే అందాలు బుట్టబొమ్మని తలపిస్తుంటే, ఆ బుట్టబొమ్మ సొగసుల్ని స్టైలిష్‌గా బన్నీ వర్ణించేస్తుంటే, అబ్బో ఆ ఇసిత్రం సూడ్డానికి రెండు కళ్లూ సాలట్లే. 'ఇంతకన్నా మంచి పోలికేది తట్టలేదమ్మో..' అంటూ పాటలోని లిరిక్స్‌ అద్భుతహ అనిపిస్తున్నాయి. గతంలో 'అత్తారింటికి దారేది..' చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ 'అమ్మో బాపుగారి బొమ్మో..' సాంగ్‌ ఓ రేంజ్‌లో ఊపేసింది. ఆ రేంజ్‌లో ఇప్పుడు 'బుట్టబొమ్మ..' వెంటాడేస్తోంది. జస్ట్‌ శాంపిల్‌ కోసమే చూపించిన విజువల్స్‌ పిచ్చెక్కించేస్తున్నాయి. విజువల్స్‌కి తగ్గట్లుగా బన్నీ డాన్సులు, బుట్టబొమ్మలాంటి పూజా హెగ్దే అప్పియరెన్స్‌ అన్నీ ఒకదానికొకటి డామినేట్‌ చేసుకుంటున్నాయి. జస్ట్‌ శాంపిలే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక ఫుల్‌ సాంగ్‌ వీడియో మతి పోగొట్టేయడం ఖాయం.

ALSO READ: గ్రాఫిక్స్‌లో సూప‌ర్ స్టార్‌ని సృష్టించారా?