ENGLISH

చిరుని టెన్ష‌న్ పెడుతున్న కాజ‌ల్

08 October 2020-16:00 PM

కాజ‌ల్ పెళ్లి కుదిరింది, ఈనెల 30నే పెళ్లి. దాంతో.. కాజ‌ల్ ఫ్యాన్స్ హ‌ర్ట‌యిపోతున్నారు. చంద‌మామ‌కి పెళ్లి సెట్ట‌వ్వ‌డంతో చాలా హృద‌యాలు భ‌గ్గుమంటున్నాయి. మ‌రోవైపు చిరంజీవి కూడా... కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నార్ట‌. ఎందుకంటే త‌న `ఆచార్య‌` సినిమాకి కాజ‌ల్ పెళ్లి అడ్డంకిగా మార‌బోతుందా? అని. చిరు న‌టిస్తున్న `ఆచార్య‌`లో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల‌లోనే `ఆచార్య‌` సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కాజ‌ల్ తో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. ఈస‌మ‌యంలో కాజ‌ల్ పెళ్లి వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

మ‌రి ఈ స‌మ‌యంలో కాజ‌ల్ షూట్‌కి అందుబాటులో ఉంటుందా, లేదా? అనే టెన్ష‌న్ చిత్ర‌బృందానికి ప‌ట్టుకుంది. అయితే కాజ‌ల్ నుంచి చిత్ర‌బృందానికి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చింద‌ట‌. ఎట్టిపరిస్థితుల్లోనూ షూటింగ్ కి అందుబాటులో ఉంటాన‌ని కాజ‌ల్ మాట ఇచ్చింద‌ట‌. అయితే.. ఎందుకైనా మంచిద‌ని, కాజ‌ల్ షెడ్యూల్ లో స్వ‌ల్ప మార్పులు చేసుకోనుంద‌ట ఆచార్య టీమ్‌. కాజ‌ల్ కి సంబంధించిన స‌న్నివేశాలు ఆల‌స్యంగా తెర‌కెక్కించాల‌న్న‌ది లేటెస్ట్ ప్లాన్‌. ఇలా చేస్తే అటు కాజ‌ల్ కీ, ఇటు ఆచార్య టీమ్ కీ ఇబ్బంది ఉండ‌ద‌ని భావిస్తున్నారు.

ALSO READ: బిగ్‌బాస్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌!