ENGLISH

అల్లు అర‌వింద్ కి పోటీగా..చిరు?

18 October 2020-09:49 AM

అల్లు అర‌వింద్ ఇటీవ‌లే `అల్లు స్టూడియో` పేరుతో గండిపేట‌లో ఓ స్టూడియో నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన సంగ‌తి తెలిసిందే. ఏడు ఎక‌రాల విస్తీర్ణంలో ఈ స్టూడిద‌యోని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టి కూడా స్టూడియో నిర్మాణంపై ప‌డిందని తెలుస్తోంది. చిరు కి స్టూడియో నిర్మించాల‌ని ఎప్ప‌టి నుంచో ఉంది. విశాఖ తీరంలో చిరంజీవి వంద ఎక‌రాలు కొనుగోలు చేశార‌ని, అక్క‌డే స్టూడియో నిర్మిస్తార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ స్టూడియో విష‌యంలో క్లారిటీ లేదు. విశాఖ‌లో స్టూడియో నిర్మాణం దాదాపు ఆగిపోయిన‌ట్టే అని స‌మాచారం. అందుకు ప్ర‌తిగా.. హైద‌రాబాద్ లోనే చిరు ఓ మినీ స్టూడియోని నిర్మించాల‌ని భావిస్తున్నార్ట‌.

 

రింగ్ రోడ్డు స‌మీపంలో చిరుకి కొంత‌మేర స్థ‌లం ఉంద‌ని తెలుస్తోంది. స్టూడియో నిర్మాణానికి ఆ చోటు అనువుగా ఉంటుంద‌ని చిరు భావిస్తున్నార్ట‌. అక్క‌డ కొన్ని ఫ్లోర్లూ, కాటేజీలు నిర్మించి టీవీ, సినిమా షూటింగుల‌కు అద్దెకు ఇవ్వాల‌ని అనుకుంటున్నార్ట‌. త్వ‌ర‌లోనే స్టూడియో నిర్మాణానికి అనుమ‌తులు తీసుకుని, ప‌నులు ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఓ వైపు అల్లు అర‌వింద్ స్టూడియో క‌డుతుంటే, ఇప్పుడు చిరు కూడా అందుకు రెడీ అవ్వ‌డం చిత్ర‌సీమ‌ని ఆశ్చర్య‌ప‌రుస్తోంది. దాంతో చిరు, అర‌వింద్ లు పోటీ ప‌డుతున్నారా? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ALSO READ: అదే నిజ‌మైతే... ప్ర‌భాస్ సినిమా క్రేజ్ ఏం కానూ.?