ENGLISH

అదే నిజ‌మైతే... ప్ర‌భాస్ సినిమా క్రేజ్ ఏం కానూ.?

17 October 2020-18:27 PM

ప్ర‌భాస్ సినిమా అంటే.. అది క‌చ్చితంగా పాన్ ఇండియా సినిమానే అవుతోంది. ప్ర‌భాస్ సినిమా మొద‌ల‌వుతోందంటే... యావ‌త్ భార‌త దేశం చూపు అటు వైపు ఉంటోంది. ప్ర‌భాస్ సినిమాలో స్టార్లు, బ‌డ్జెట్లూ... ఆ స్థాయిలో ఉంటాయి. `ఆది పురుష్‌` గురించీ అలానే దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ కి మ‌రో కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

అయితే సీత‌గా ఎవ‌ర‌న్న విష‌యంలో ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. కీర్తి సురేష్‌, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. వీళ్ల‌లో ఎవ‌రైనా బాగానే ఉంటుంది. అయితేఇప్పుడు తాజాగా కృతి స‌న‌న్ పేరు కూడా వినిపిస్తోంది. కృతి స‌న‌న్ ని సీత గా ఎంచుకున్నార‌ని, ఆమె పేరు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. కృతి స‌న‌న్ అనే స‌రికి ప్ర‌భాస్ అభిమానుల గుండెల్లో రాళ్లు ప‌డ్డాయి. ఎందుకంటే కృతికి ఐరెన్ లెగ్ గా పేరుంది. తాను చేసిన సినిమాల‌న్నీ ఫ‌ట్టుమ‌న్నాయి. అందుకే కృతి ఎందుకు రా బాబూ.. అనుకుంటున్నారంతా. అయితే ఈ వార్త నిజ‌మా, క‌దా? అనే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. చిత్ర‌బృందం ఏమంటుందో చూడాలి. కృతి ఓకే అయితే గ‌నుక‌... ఈ సినిమా క్రేజ్ పై ప్ర‌భావం చూపించే ప్ర‌మాదం ఉంది.

ALSO READ: పెనాల్టీతో స‌హా క‌ట్టేశాడు