ENGLISH

దసరా బరిలోకి ‘రొమాంటిక్‌’గా దూకేస్తారా?

05 October 2020-16:00 PM

విజయదశమి వచ్చేస్తోంది.. మామూలుగా అయితే, ఇప్పటికే సినిమా రిలీజ్‌ల సందడి నెలకొనాలి. కానీ, సినిమా హాళ్ళు ఇంకా తెరుచుకోలేదు. అక్టోబర్‌ 15 నుంచి తెరచుకునే అవకాశాలు వున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కేంద్రం అనుమతులిచ్చినా, రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి వుంది. సగం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్ళు తెరుస్తామని సినిమా హాళ్ళ నిర్వాహకులు ప్రకటించారు. కానీ, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్ళు తెరిస్తే తద్వారా లాభం లేదు సరికదా, నష్టమేనన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది.

 

ఇదిలా వుంటే, దసరా సీజన్‌ని క్యాష్‌ చేసుకోవడానికి కొందరు నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా ‘రొమాంటిక్‌’ సినిమా కూడా చేరిందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ హీరోగా నటించాడు ఈ సినిమాలో. ముద్దుగుమ్మ కేతికా శర్మ ఈ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేస్తోంది. ఛార్మి, పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తోపాటుగా దీన్ని నిర్మించినా, కొన్ని కారణాలతో ‘రొమాంటిక్‌’ కాస్త ఆలస్యమయ్యింది. ఈలోగా కరోనా రావడంతో అది మరింత వెనక్కి వెళ్ళింది.

 

ఒకవేళ దసరా నాటికి పరిస్థితులు అనుకూలించకపోతే, దీపావళికి పక్కా.. అంటున్నారు. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఒకవేళ సినిమా హాళ్ళలో వీలు కుదరకపోతే, ఎటూ ఓటీటీ ఆప్షన్‌ వుండనే వుంది కదా.!

ALSO READ: షాక్‌... సంజూ ఇలా అయిపోయాడేంటి?