ENGLISH

ఆ వికెట్‌ కూడా గంగవ్వ ఖాతాలోనే!

05 October 2020-15:30 PM

బిగ్‌ బాస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అయిపోయినా, వారందర్నీ గంగవ్వ ఖాతాలో పడేస్తున్నారు. తాజాగా స్వాతి దీక్షిత్‌, బిగ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ కాగా.. ‘హౌస్‌లో ఎలాంటి టాస్కుల్లోనూ సరిగ్గా ప్రదర్శన ఇవ్వని గంగవ్వను సేవ్‌ చేస్తూ, స్వాతిని హౌస్‌ నుంచి ఎందుకు పంపించేస్తున్నారు..’ అంటూ బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు. గంగవ్వ వృద్ధురాలు. ఆమె మాట్లాడుతున్న మాటలు కూడా సరిగ్గా అర్థం కావడంలేదు. కంటెస్టెంట్స్‌ ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వుంటోంది గంగవ్వ. వృద్ధురాలు కావడంతో, టాస్క్‌ల విషయంలో గంగవ్వను పక్కన పెట్టాల్సి వస్తోంది.

 

నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఆమెను అడపా దడపా హైలైట్‌ చేసేతందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కంటెస్టెంట్స్‌, గంగవ్వను నామినేట్‌ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. తొలివారం సూర్య కిరణ్‌, రెండో వారం కళ్యాణి, మూడో వారం దేవి నాగవల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్‌.. ఇలా ఎలిమినేట్‌ అయినవారందరితో పోల్చితే, గంగవ్వ ఎందులో ఎక్కువ.? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

 

కానీ, సోషల్‌ మీడియాలో గంగవ్వకు చాలామంది ఫాలోవర్స్‌ వున్నారు. అదే ఆమెను హౌస్‌లో ఎక్కువ రోజులు వుండడానికి కారణ:గా చెబుతున్నారు. కానీ, అలా చేయడం వల్ల మిగతా కంటెస్టెంట్స్‌కి నష్టం జరుగుతోంది కదా!

ALSO READ: షాక్‌... సంజూ ఇలా అయిపోయాడేంటి?