ENGLISH

కంగన ఎఫెక్ట్‌: ఆ డైరెక్టర్‌ పరిస్థితి ఏమవుతుందో!

05 October 2020-14:19 PM

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఏ దర్శకుడితో పనిచేసినా ఆ దర్శకుడి బతుకు బస్టాండేనన్న అభిప్రాయం ‘మణికర్ణిక’ సినిమాతో బలపడిపోయింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన మన టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడిని బాలీవుడ్‌లో ఏ స్థాయిలో కంగనా రనౌత్‌ బదనాం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరో సౌత్‌ దర్శకుడు, కంగనా రనౌత్‌ చేతిలో బలైపోతాడేమోనన్న చర్చ తమిళ సినీ వర్గాల్లో జరుగుతోంది.

 

ఆ దర్శకుడు ఎవరో కాదు విజయ్‌. కంగనా రనౌత్‌తో ప్రస్తుతం ‘తలైవి’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విజయ్‌. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమయ్యింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌కి బ్రేక్‌ పడగా, ఇటీవల కంగనా రనౌత్‌ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. విజయ్‌ తనకు కొన్ని సీన్స్‌ వివరిస్తున్న వైనానికి సంబంధించి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో కంగన షేర్‌ చేయగానే, నెటిజన్స్‌ ఆమెని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది దర్శకుడు విజయ్‌పై జాలి చూపిస్తున్నారు.

 

‘సినిమా పూర్తయ్యేవరకూ విజయ్‌ దర్శకుడే.. కానీ, సినిమా పూర్తయ్యాక మాత్రం ఆ క్రెడిట్‌ కంగనా రనౌత్‌కి వెళ్ళిపోతుంది.. కంగనా ఇప్పటికే ఎలాంటి వివాదాలు సృష్టించాలో ఓ నిర్ణయానికి వచ్చేసి వుంటుంది’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జర జాగ్రత్త విజయ్‌.. క్రిష్‌లా బదనాం అయిపోవద్దంటూ టాలీవుడ్‌ సినీ అభిమానులూ విజయ్‌ పట్ల సానుభూతి చూపిస్తుండడం గమనార్హం.

ALSO READ: Kangana Latest Photoshoot