ENGLISH

కొత్త యాంగిల్‌ చూపించిన స్టార్‌ హీరో కొడుకు.

17 August 2019-19:00 PM

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలీదు అని పలు మార్లు చెప్పారు. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. తన శరీరం సినిమాకే అంకితం అంటాడాయన. అచ్చు అదే ఆటిట్యూడ్‌ కొడుకు ధృవ్‌లోనూ కనిపిస్తోంది. తెలుగు బ్లాక్‌ బస్టర్‌ 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌తో ధృవ్‌ హీరోగా డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆదిత్య వర్మ' టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ధృవ్‌ మేకోవర్‌ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 

ఇటీవల విడుదలైన 'ఆదిత్య వర్మ' టీజర్‌తో అందర్నీ మెప్పించేశాడు ధృవ్‌. ఇక త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్ర్రమోషన్స్‌ వేగవంతం చేసింది. అందులో భాగంగా ఓ పాటను విడుదల చేసింది. ఈ పాటను ఆలపించింది స్వయానా ధృవ్‌నే. కేవలం నటనే కాదు, తండ్రిలా తనలో చాలా టాలెంట్స్‌ ఉన్నాయని చెప్పడానికి జస్ట్‌ ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.ఈ వీడియోలో ప్రొఫిషనల్‌ సింగర్‌గా ధృవ్‌ ఈ పాటను ఆలపించిన వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

 

గాత్రం ఆకట్టుకుంటోంది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోని లక్షల్లో వీక్షించారు. ప్రశంసలూ, లైకులూ ముంచెత్తాయి. ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయ్యింది. 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా శిష్యుడు గిరి శయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. బనితా సందు హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

ALSO READ: 'వాల్మీకి'ని తట్టుకోవడం నేచురల్‌ స్టార్‌కి కష్టమే సుమీ.!