ENGLISH

క్రాక్ టీమ్ ని దింపేస్తున్నాడుగా..!

05 January 2022-15:08 PM

చిత్ర‌సీమ‌లో సెంటిమెంట్లు ఎక్కువే. అయితే గోపీచంద్ మ‌లినేని మాత్రం సెంటిమెంట్ల‌తో `క్రాక్‌` పుట్టించేలా ఉన్నాడు. త‌న గ‌త సినిమా `క్రాక్‌` టీమ్ ని త‌న కొత్త సినిమాకీ రంగంలోకి దింపేస్తున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో గోపీచంద్ మ‌లినేని ఓసినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి త‌ర‌వాత ఈ సినిమా ప‌ట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా శ్రుతి హాస‌న్ ని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. క్రాక్ లో శ్రుతినే నాయిక‌. క్రాక్ కి సంగీతం అందించిన త‌మ‌న్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నాడు.

 

ఇప్పుడు క్రాక్ లో కీల‌క పాత్ర పోషించిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ని సైతం టీమ్ లోకి తీసుకొచ్చాడు. ఫైట్ మాస్ట‌ర్లుగా రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల‌ను ఎంచుకున్నాడు. వీళ్లూ క్రాక్ లో ప‌నిచేసిన‌వాళ్లే. అలా.. ఈ సినిమా మొత్తం.. క్రాక్ టీమ్ నే క‌నిపిస్తోంది. విల‌న్ గా మాత్రం... క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ని ఎంచుకున్నారు.

ALSO READ: రిప‌బ్లిక్ ఫ్లాప్ కి ప‌వ‌న్ కార‌ణ‌మా? అదెలా...?