ENGLISH

బంగార్రాజు వ‌స్తాడు గానీ... ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

06 January 2022-10:03 AM

ఎట్ట‌కేల‌కు ఈనెల 14న రావ‌డానికి బంగార్రాజు రెడీ అయ్యాడు. రాధే శ్యామ్ విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో.. బంగార్రాజుకి మంచి ఛాన్స్ దొరికిన‌ట్టైంది. బంగార్రాజు వ‌స్తే... ఈ సంక్రాంతికి అదే పెద్ద‌సినిమా అవుతుంది. కానీ... ఒకే ఒక్క ష‌ర‌తు. ఒమైక్రాన్ గోల ఉండ‌కూడ‌దు. ఈమ‌ధ్య‌లో కేసులు పెరిగి, నైట్ క‌ర్‌ఫ్యూలాంటివి విధిస్తే... బంగార్రాజు కూడా రాడు. ఈ విష‌యాన్ని నాగ్ స్వ‌యంగా చెప్పారు. `ప‌రిస్థితులు అన్నీ బాగుంటే.. ఈనెల 14 న వ‌స్తాం. చేయి దాటితే చెప్ప‌లేం` అని క్లారిటీ ఇచ్చేశారు. ముందు నుంచీ ఈ సినిమాని సంక్రాంతికే తీసుకురావాల‌ని అనుకుంటున్నామ‌ని, అయితే... కాస్త సందేహం ఉండ‌డంతో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌లేదని, సినిమా స‌కాలంలో సిద్ధం అవ్వ‌డంతో సంక్రాంతి బ‌రిలో దింపుతున్నామ‌ని నాగార్జున వ్యాఖ్యానించారు.

 

ఏపీ, తెలంగాణ‌ల‌లో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నైట్ క‌ర్‌ఫ్యూ విధించేఅవ‌కాశాలు ఉన్నాయ‌ని పుకార్లు మొద‌ల‌య్యాయి. ఈనెల 10 న జ‌గ‌న్ ప‌రిస్థితిని స‌మీక్షించి నైట్ క‌ర్‌ఫ్యూ విష‌యంలో.. ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. 11 నుంచి క‌ర్‌ఫ్యూ విధిస్తే... బంగార్రాజు రాడు. లేదంటే.. నిక్షేపంలా... ఈనెల 14న వ‌చ్చేస్తాడు.

ALSO READ: క్రాక్ టీమ్ ని దింపేస్తున్నాడుగా..!