ENGLISH

'హిర‌ణ్యక‌శ్యప' కంటే ముందు ఓ ప్రేమకథ.

10 October 2020-12:00 PM

'హిర‌ణ్యక‌శ్యప' కోసం ఏర్పాట్లు చేసుకున్నారు గుణశేఖర్. రానా హీరోగా ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇంతలో ఏమైయిందో కానీ ఇప్పుడు ప్లాన్ మారిపోయింది. హిర‌ణ్యక‌శ్యప' కంటే ముందుగా మ‌హాభార‌తం ఆదిప‌ర్వంలోని శ‌కుంత‌ల‌-దుష్యంతుల ప్రేమ‌క‌థ‌ను చూపించబోతున్నారు. దీనికి 'శాకుంత‌లం' అనే పేరుని ఖరారు చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

 

ఈ విషయాన్ని త‌న ట్విట్టర్ ద్వారా ఆయ‌న ప్రక‌టించారు. "వెండితెరపై 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు ... భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని టైటిల్ మోష‌న్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. 'రుద్రమ‌దేవి' సినిమా త‌రహాలోనే 'శాకుంత‌లం' చిత్రాన్ని కూడా ఆయ‌న సొంత నిర్మాణ సంస్థ గుణా టీమ్ వ‌ర్క్స్ పై నిర్మించ‌నున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం. నటీనటులు వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: మ‌హేష్ సినిమాలో మ‌రో హీరో?