ENGLISH

రియా చక్రవర్తి నెక్స్‌ట్‌ ఏం చేస్తుందో.!

10 October 2020-11:00 AM

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్‌ లభించిన విషయం విదితమే. డ్రగ్స్‌ కేసుతోపాటు, సుశాంత్‌ మిస్టీరియస్‌ డెత్‌ కేసులోనూ ఆమెపై ఆరోపణలున్నాయి. అయితే, తనకు ఏ పాపమూ తెలియదని అంటోంది రియా చక్రవర్తి. తనను కొందరు కుట్రపూరితంగా ఈ కేసుల్లో ఇరికించారని ఇప్పటికే పలు సందర్భాల్లో రియా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, బెయిల్‌పై విడుదలయ్యాక రియా చక్రవర్తి ఏం చేస్తోంది.? ఆమె భవిష్యత్‌ కార్యాచరణ ఎలా వుండబోతోంది.? అన్న విషయమై బాలీవుడ్‌ మీడియా ఆసక్తిగా ఆరా తీయడం మొదలు పెట్టింది.

 

కొన్నాళ్లపాటు రియా చక్రవర్తి, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులకు తప్ప ఇంకెవరికీ అందుబాటులో వుండకూడదనే నిర్ణయానికి వచ్చిందట. బెయిల్‌ నిబంధనల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వుండాలనుకుంటున్న రియా చక్రవర్తి, ఆ బెయిల్‌ నిబంధనలు తొలగిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచన చేస్తుందట.

 

మరోపక్క, రియా చక్రవర్తితో సినిమాలు నిర్మించేందుకు పలువురు బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇంకో రెండు మూడు నెలల వరకు నేను అందుబాటులో వుండలేను’ అని రియా వారికి తేల్చి చెప్పిందట. కాగా, రియా చక్రవర్తి బయోపిక్‌ తరహాలో కాదుగానీ, ఆమె ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న సమస్యలపై ఓ సినిమా తీయడానికి ఓ యువ దర్శకుడు ముందుకొచ్చినట్లు సమాచారం.

ALSO READ: యండ‌మూరి న‌వ‌ల‌... ఇన్నాళ్ల‌కు సినిమాగా!