ENGLISH

చీకటి గదిలోకి’ రెండోస్సారి వెళ్ళేదెవరు.?

08 October 2020-17:30 PM

బి-గ్రేడ్‌ అడల్ట్‌ మూవీ అనే స్థాయిలో సాఫ్ట్‌ పోర్న్‌ కామెడీ తరహా సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ళ క్రితం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమా వచ్చింది. సంతోష్‌ పి జయకుమార్‌ అనే యువ దర్శకుడు తమిళంలో తాను రూపొందించిన ఓ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేశాడు ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ పేరుతో. అదిత్‌ అరుణ్‌, నిక్కీ తంబోలీ, హేమంత్‌ తదితరులు ఈ సినిమాలో ప్రధాన తారాగణం. ప్రస్తుతం తమిళ వెర్షన్‌కి సీక్వెల్‌ రూపొందించిన సంతోష్‌ పి జయకుమార్‌, త్వరలోనే తెలుగులోనూ దాన్ని రీమేక్‌ చేయాలని అనుకుంటున్నాడట.

అయితే, ఈసారి కాస్త పేరున్న తారాగణాన్ని ఎంపిక చేయాలన్నది సంతోష్‌ పి జయకుమార్‌ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా, తమిళంలో విడుదల కానున్న ‘ఇరందుంకుత్తు’నే డబ్‌ చేసి తెలుగులోకి వదిలేస్తే బెటర్‌.. అన్న దిశగానూ ఆలోచనలు సాగుతున్నాయట. ఈ తరహా సినిమాల్లో భయపెట్టే కంటెంట్‌ కంటే, యువతను పిచ్చెక్కించే రొమాంటిక్‌ కంటెంటే ఎక్కువగా వుంటుంది. ‘ఇరందుంకుత్తు’ ట్రైలర చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. అయితే, బాలీవుడ్‌లో వచ్చిన కొన్ని సినిమాల నుంచి సీన్స్‌ ఎత్తేశారన్న విమర్శలూ లేకపోలేదు. ‘శృంగార సాధనాలు’ వంటివాటిని కూడా ఈ ‘ఇరందుంకుత్తు’లో కామెడీగా వాడేయడం కొంత జుగుప్సాకరంగా అనిపిస్తోంది. కానీ, ఇలాంటివాటికీ స్పెషల్‌ ఆడియన్స్‌ వుంటారు గనుకనే ఈ తరహా సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. ఓటీటీ కంటెంట్‌లోకి ఇలాంటివి బాగా వర్కవుట్‌ అవుతాయి.

ALSO READ: ద‌ర్శ‌కేంద్రుడు ఏం చెప్ప‌బోతున్నాడు?