ENGLISH

ద‌ర్శ‌కేంద్రుడు ఏం చెప్ప‌బోతున్నాడు?

08 October 2020-17:00 PM

`ఓం న‌మో వెంక‌టేశాయ‌` త‌ర‌వాత కె.రాఘ‌వేంద్ర‌రావు మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. ఆ సినిమా త‌ర‌వాత‌.. రాఘ‌వేంద్ర‌రావు సినిమాల‌కు దూరం అవుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందుకు త‌గ్గ‌ట్టే - ఆయన్నుంచి అలికిడి లేదు. అయితే... ఓ హిట్ సినిమాతో కెరీర్‌ని ముగించ‌డం బాగుంటుంద‌ని రాఘ‌వేంద్ర‌రావుకి స‌ల‌హాలూ, సూచ‌న‌లు రావ‌డంతో ఓ మంచి సినిమా తీసి, అప్పుడు హుందాగా సినిమాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. రాఘ‌వేంద్ర‌రావు నుంచి త్వ‌ర‌లో ఓ సినిమా రాబోతోంద‌ని, అందుకు సంబంధించిన సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లొస్తున్నాయి.

 

ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడి నుంచి ఓ ప్ర‌క‌ట‌న కూడా రాబోతోంది. శుక్ర‌వారం ఉద‌యం రాఘ‌వేంద్ర‌రావు సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ రాబోతోంది. అది ఏమై ఉంటుందా? అని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఎవ‌రు? ఎలాంటి సినిమా? అనే చ‌ర్చ న‌డుస్తోందిప్పుడు. `పెళ్లి సంద‌డి` టైపులో ఓ స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా తీస్తార‌ని, అందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా రెడీ అయ్యింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏమై ఉంటుందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

ALSO READ: చిరుని టెన్ష‌న్ పెడుతున్న కాజ‌ల్