ENGLISH

మెగాస్టార్‌ చిరంజీవి ‘రాంగ్‌ స్టెప్‌’ వేస్తున్నారట.

11 October 2020-09:21 AM

150 సినిమాలు చేసిన అనుభవం మెగాస్టార్‌ చిరంజీవి సొంతం. ఆయన తప్పటడుగులు వేస్తారని ఎలా అనుకోగలం.? సినీ పరిశ్రమలో ఫ్లాపులు, హిట్లు అనేవి సర్వసాధారణం. సినిమా రిజల్ట్‌పై ముందే జోస్యం చెప్పలేమని చాలామంది సినీ ప్రముఖులు చెబుతుంటారు. ఇప్పుడీ చర్చ ఎందుకంటే, మెగాస్టార్‌ చిరంజీవి తన తదుపరి సినిమాల విషయంలో రాంగ్‌ స్టెప్‌ వేస్తున్నారంటూ కుప్పలు తెప్పలుగా గుసగుసలు వచ్చిపడుతున్నాయి. వి.వి. వినాయక్‌, బాబీ, మెహర్‌ రమేష్‌.. ఈ ముగ్గురూ ప్రస్తుతం హిట్స్‌ లేని దర్శకులు. ఈ ముగ్గురితోనూ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలు చేయబోతుండడంపై కొందరు అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 

‘చిరంజీవి తప్పు చేస్తున్నారు’ అంటూ సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. అయితే, జెన్యూన్‌ మెగా ఫాన్స్‌ మాత్రం.. చిరంజీవికి అన్నీ తెలుసని అంటున్నారు. ‘150 సినిమాలు చేసిన చిరంజీవికి, ఎవరితో ఎలాంటి సినిమా చేయాలో తెలియకుండా ఎలా వుంటుంది.? ఫ్లాప్‌ డైరెక్టర్‌ అనే చర్చ అనవసరం. సబ్జెక్ట్‌ని చిరంజీవి నమ్ముతారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనే చర్చ ఇప్పుడు అసందర్భం’ అన్నది జెన్యూన్‌ మెగా ఫాన్స్‌ వాదన. అయినాగానీ, ఆయా దర్శకుల్ని సోషల్‌ మీడియాలో కొందరు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. మరి, ఆ ట్రోల్స్‌లో అర్థం లేదని చిరంజీవి తదుపరి సినిమాలు నిరూపిస్తాయా.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌.

ALSO READ: ల‌క్ష్మీబాంబుపైనే 'బాంబు' ప‌డింది