ENGLISH

ఈసారైనా కాజ‌ల్ పెళ్లి జ‌రుగుతుందా?

05 October 2020-17:06 PM

కాజ‌ల్ పెళ్లి వార్త‌... ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కాజ‌ల్ పెళ్లి సెటిలైపోయింద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి క‌బురు వినిపిస్తోంద‌ని టాక్‌. గౌత‌మ్ అనే వ్యాపార వేత్త‌ని కాజ‌ల్ పెళ్లి చేసుకోబోతోంద‌ని, నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స‌యిపోయింద‌ని అంటున్నారు. గౌత‌మ్ ఫొటోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాజ‌ల్ పెళ్లి వార్త ఇలా లీక‌వ్వ‌డం ఇదేం కొత్త కాదు. ఇది వ‌ర‌కూ కాజ‌ల్ పెళ్లి గురించి చాలానే మాట్లాడుకున్నారు. చాలా క‌బుర్లే వినిపించారు. అయితే వాటిపై కాజల్ ఎప్పుడూ స్పందించ‌లేదు. అవి నిజం కూడా కాలేదు.

 

అయితే ఈసారి మాత్రం కాజ‌ల్ పెళ్లి పక్కా అంటున్నాయి సినీ వ‌ర్గాలు. కాజ‌ల్ పెళ్లి ఖాయ‌మ‌ని, వ‌రుడు గౌత‌మే అని, చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని, కాజ‌ల్ పెళ్లి కి రెడీ అవుతోంద‌ని టాక్‌. 2021లోనే కాజ‌ల్ పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని, పెళ్ల‌య్యాక కూడా కాజ‌ల్ సినిమాల్లో న‌టిస్తోంద‌ని అంటున్నారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతోంద‌ట‌. సో.. ఈ చంద‌మామ‌ని త్వ‌ర‌లోనే పెళ్లి కూతురిగా చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.

ALSO READ: Kajal Agarwal Latest Pics