ENGLISH

ట్రైలర్‌ టాక్‌: 'ఎమ్మెల్యే' చితక్కొట్టేశాడు

18 March 2018-07:00 AM

కళ్యాణ్‌రామ్‌ - కాజల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎమ్మెల్యే'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. కళ్యాణ్‌రామ్‌ రెండు వేరియేషన్స్‌లో కనిపించాడు ట్రైలర్‌లో. 'ఎమ్మెల్యే' అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అని ముందే చెప్పారు. ట్రైలర్‌లో మరోసారి గుర్తు చేశారు. 

పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఎంటర్‌టైనింగ్‌ మూవీ 'ఎమ్మెల్యే'. పొలిటికల్‌ పంచ్‌లు బాగానే ఉన్నాయి. 'పోటీ చేసి గెలవడం కన్నా, నాతో పోటీకే భయపడుతున్నారంటే అదే నాకు పెద్ద గెలుపన్నయ్యా..' అంటూ ట్రైలర్‌లో కళ్యాణ్‌రామ్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. కొంచెం పోలిటిక్స్‌, కొంచెం చదువు గొప్పతనం, అన్నింటికీ మించి వినోదం, అలాగే యాక్షన్‌ ఇలా షడ్రుచుల ఉగాది పచ్చడిలా 'ఎమ్మెల్యే' ట్రైలర్‌ని ఉగాది కానుకగా విడుదల చేశారు. 

సాంగ్స్‌లో కాజల్‌ అగర్వాల్‌, కల్యాణ్‌రామ్‌ జంట చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. పల్లెటూరి అందాలు, పచ్చని పంట పొలాలపై కలర్‌ఫుల్‌గా ట్రైలర్‌ని కట్‌ చేశారు. డైలాగులతో పాటు, యాక్షన్‌ కూడా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. మొత్తానికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది ట్రైలర్‌కి. చాలా కాలం తర్వాత కాజల్‌, కళ్యాణ్‌రామ్‌ జంట తెరపై మళ్లీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఉపేంద్ర మాధవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

వచ్చేవారం సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. చూడాలిక ఈ మంచి లక్షణాలున్న అబ్బాయికి ప్రేక్షకులు ఎన్ని మార్కులేస్తారో మరి.

ALSO READ: Qlik Here For MLA Trailer