ENGLISH

ప‌వ‌న్ గురించి క్రిష్ ఆగాల్సిందే!

09 October 2020-14:05 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో ఇన్ని సినిమాలున్నాయి అన్న ఆనందం కంటే... అవేమీ ప‌ట్టాలెక్క‌లేద‌న్న బాధ ఎక్కువ‌గా ఉంది ప‌వ‌న్ అభిమానుల్లో. వ‌కీల్ సాబ్ ప‌నులు ఓ కొలిక్కి వ‌స్తే, త‌ప్ప మిగిలిన సినిమాల వ్య‌వ‌హారాలు తేల‌వు. ఈనెల చివ‌రి వారంలో `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ మొద‌లు కానుంద‌ని, ప‌వ‌న్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటాడ‌ని స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కైతే, అదే ఖ‌రారు. అయితే.. ప‌వ‌న్ మూడ్ ఎలా ఉంటుందో, తెలీదు క‌దా. ఆయ‌న బ‌రిలోకి దిగేంత వ‌ర‌కూ ఎవ‌రూ ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి.

 

వ‌కీల్ సాబ్ పూర్త‌యిన వెంట‌నే క్రిష్‌సినిమా మొద‌ల‌వుతుంద‌ని అనుకున్నారంతా. కానీ ప‌వ‌న్ మాత్రం క్రిష్ సినిమాని ఇంకొన్నాళ్లు వెన‌క్కి నెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. వ‌కీల్ సాబ్ పూర్త‌వ‌గానే `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్‌ని మొద‌లెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ రీమేక్ అయితే రెండు నెలల్లో పూర్త‌యిపోతుంద‌ట‌. అదే క్రిష్ సినిమా ఒక‌సారి మొద‌లెడితే 7, 8 నెల‌లు తీసుకుంటుంద‌ట‌. అందుకే త్వ‌ర‌గా పూర్త‌యే సినిమానే ముందు ఫినిష్ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఈ విష‌యమై క్రిష్ తో ప‌వ‌న్ మాట్లాడిన‌ట్టు టాక్‌. సో.. ప‌వ‌న్ కోసం క్రిష్ ఇంకొన్నాళ్లు ఎదురు చూడ‌క త‌ప్ప‌దు.

ALSO READ: సన్నీలియోన్‌ ‘కిక్‌ బాక్సింగ్‌’ వెనుక కథ ఇదీ.!