ENGLISH

అమేజాన్‌లో మ‌రో 9 సినిమాలు.

09 October 2020-13:38 PM

లాక్ డౌన్ కార‌ణంగా దేశ వ్యాప్తంగా థియేట‌ర్లు మూత‌బ‌డ్డాయి. ఈ స‌మ‌యంలో ఓటీటీలే పెద్ద దిక్కుగా మారాయి. ఫ్లాపో, హిట్టో.. ఏదో ఓ సినిమా, ప్ర‌తీ వారం ఓటీటీలో సంద‌డి చేస్తూ కాల‌క్షేపం ఇస్తోంది. తెలుగు లో పెద్ద సినిమాల‌న్నీ అమేజాన్ ప్రైమ్ లోనే విడుద‌ల అవుతున్నాయి. పెంగ్విన్‌, వి, నిశ్శ‌బ్దం.. ఇవ‌న్నీ అమేజాన్‌లోనే క‌నిపించాయి. ఈ మూడు సినిమాలూ ఫ్లాప్‌. భారీ రేటు పెట్టి కొన్న అమేజాన్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. అయినా స‌రే, అమేజాన్ కొత్త సినిమాల్ని కొన‌డం మాన‌లేదు. ఈ సీజ‌న్‌లో మ‌రో 9 సినిమాల్ని అమేజాన్ కొనుగోలు చేసింది.

 

అందులో ఆనంద్ దేవ‌ర‌కొండ నటించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` కూడా ఉంది. వ‌చ్చే నెల 20న ఈ చిత్రాన్ని అమేజాన్ లో విడుద‌ల చేయ‌నున్నారు. వరుణ్ ధావన్ మరియు సారా అలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1, రాజ్‌కుమార్ రావు నటించిన చలాంగ్, భూమి పెడ్నేకర్ యొక్క దుర్గావతి, ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ (తెలుగు), మాధవన్ నటించిన మారా (తమిళం), అరవింద్ అయ్యర్ నటించిన భీమ సేన నల మహారాజా మరియు హలాల్ లవ్ స్టోరీ (మలయాళం) 2020 అక్టోబర్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 200 కి పైగా దేశాలు మరియు టెర్రిటోరియస్ లలో ప్రదర్శించబడనున్నాయి.

ALSO READ: ప్ర‌భాస్ కోసం బిగ్ బీ!‌