ENGLISH

సన్నీలియోన్‌ ‘కిక్‌ బాక్సింగ్‌’ వెనుక కథ ఇదీ.!

09 October 2020-13:00 PM

బాలీవుడ్‌ నటిగా మారిన ఒకప్పటి అడల్ట్‌ స్టార్‌ సన్నీలియోన్‌, తిరిగి అడల్ట్‌ ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళబోతోందనే ప్రచారం ఓ వైపు జరుగుతోంటే, ఆ ఉద్దేశ్యమే తనకు లేదని అంటోందామె. అసలు ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది.? అన్నది ఆమెకే అర్థం కావడంలేదట. బాలీవుడ్‌లో ఈ మధ్య సన్నీలియోన్‌ హంగామా కన్పించడంలేదు. ఎవరూ సన్నీలియోన్‌ గురించి ఆలోచించడంలేదు కూడా. దాంతో, ఏదో కొత్తగా చేసి.. మళ్ళీ బాలీవుడ్‌ తెరపై వెలిగిపోవాలనుకుంటోంది సన్నీలియోన్‌. ఈ క్రమంలోనే ఆమె కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటోంది.

 

ఈ క్రమంలోనే ఆమె కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటోంది. ఈ విషయమై ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సౌత్‌లో ఓ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ ఫిలిం సన్నీలియోన్‌ చేయబోతోందనీ, ఈ సినిమా కోసమే ఆమె ‘కిక్‌ బాక్సింగ్‌’ నేర్చుకుంటోందనీ తెలుస్తోంది. కాగా, ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే తపనతో తాను ‘కిక్‌ బాక్సింగ్‌’ నేర్చుకుంటున్నట్లు చెప్పిన సన్నీలియోన్‌, ఆబ్వియస్‌గా ఇది సినిమాలకూ ఉపయోగపడుతుందని చెప్పడం గమనార్హం.

 

కరోనా తర్వాత గ్లామరస్‌ ఇండస్ట్రీ ఆలోచనలు చాలా మారాయనీ, సినిమాలతో పోల్చితే ఓటీటీ కంటెంట్‌కి ఎక్కువ డిమాండ్‌ ఏర్పడిందనీ అంటోన్న సన్నీలియోన్‌ తాను కూడా తన భర్తతో కలిసి ఓటీటీ కంటెంట్‌ని అందించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వున్నట్లు పేర్కొంది. సినిమాల్లో అవకాశాలు తనకు తగ్గలేదనీ, కరోనా కారణంగా ఏర్పడ్డ స్తబ్దత కారణంగానే కొంత గ్యాప్‌ వచ్చిందని అంటోంది సన్నీలియోన్‌.

ALSO READ: తేజూ సినిమా హీరోయిన్ మారిపోయింది