ENGLISH

స్టార్‌ స్టార్‌ లేడీ సూపర్‌ స్టార్‌ అందుకేగా.!

14 January 2020-16:30 PM

లేడీ సూపర్‌ స్టార్‌ అనే బిరుదు ఆమెకి అంత సులువుగా వచ్చేయలేదు అందుకే. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్ధయమ్యే ఉంటుందిగా. లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి. 13 ఏళ్ల గ్యాప్‌ తర్వాత 'సరిలేరు..' సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్‌లో మొదటిగా విడుదలై, సినిమా పోజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతున్న సంగతి కూడా తెలిసిందే. సినిమాలో ఆమె నటనకు ఎప్పటిలాగే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ప్రమోషన్స్‌లోనూ విజయశాంతి హుషారుగా పాల్గొంటున్నారు. తాజాగా 'సరిలేరు..' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. నటుడు బ్రహ్మాజీతో విజయశాంతి ఓ యాక్షన్‌ చేస్తున్న వీడియో అది. ప్యాంట్‌ షర్టు ధరించి కాలు లేపి కరాటే ఫీట్‌ చేస్తున్న వీడియో అది. ఈ ఫీట్‌ చూసి ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

ఈ వయసులోనూ ఆమెలోని గ్రేస్‌ ఎంత మాత్రమూ తగ్గలేదని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. హీరోలకు ధీటుగా కరాటే ఫైట్లు చేయడంలో విజయశాంతి ధిట్ట. అదే గ్రేస్‌తో ఇంత వయసులోనూ ఆమె చేసిన ఈ ఫీట్‌ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫైట్‌ సీన్‌ చూసి, ఆమెతో మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ సినిమా చేసేయొచ్చనే ఆలోచనలు కూడా వచ్చేస్తాయి మన దర్శక, నిర్మాతలకు. అసలే పవర్‌ఫుల్‌ రోల్స్‌ అయితేనే నటిస్తాను.. అని వస్తూ వస్తూనే హింట్‌ ఇచ్చిన విజయ శాంతి, ఈ వీడియో బైట్‌ చూశాక ఆ మాటలకు బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తోంది.

ALSO READ: 'సరిలేరు నీకెవ్వరు'.. 'రియల్‌' కలెక్షన్స్‌