ENGLISH

'అల..'ను ప్రశంసించిన సుకుమార్‌.!

14 January 2020-15:25 PM

'అల వైకుంఠపురములో..' సినిమాకి ఫ్యాన్స్‌ నుండి వచ్చే ట్రెమండస్‌ రెస్పాన్స్‌, బాక్సాఫీస్‌ కలెక్షన్సే కాకుండా, సెలబ్రిటీలు, సినీ ప్రముఖుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నిన్నటికి నిన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'అల..' టీమ్‌ని ప్రశంసిస్తూ, సినిమా సక్సెస్‌ అయినందుకు కంగ్రాట్స్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తాజాగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ 'అల..' సినిమా చూసి, స్వయంగా అల్లు అర్జున్‌నీ, చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తుతూ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. అల్లు అర్జున్‌ నటన అద్భుతంగా ఉందనీ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ టేకింగ్‌ చాలా చాలా బాగుందనీ, ఆయన తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారంటూ సుకుమార్‌ ట్వీట్‌ చేశారు.

 

అలాగే నేపథ్య సంగీతం అద్భుతంగా ఉందంటూ తమన్‌నీ పొగడ్తలతో ముంచెత్తారాయన. ఇలా 'అల..' టీమ్‌ మొత్తానికీ అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక బాక్సాఫీస్‌ వద్ద కాసుల గలగల అల్లు అర్జున్‌ స్టామినాని నిరూపించింది. త్రివిక్రమ్‌ - బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీగా 'అల..' సూపర్‌ హిట్‌ రేస్‌లో దూసుకెళ్తోంది. సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌గా ఈ చిత్రం బన్నీ - త్రివిక్రమ్‌ని ఈ సినిమా టాప్‌ ప్లేస్‌లో నిలబెట్టింది. పూజా హెగ్దే - అల్లు అర్జున్‌ పెయిర్‌కీ బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ దక్కుతున్నాయి 'అల వైకుంఠపురములో..'.

ALSO READ: 'సరిలేరు నీకెవ్వరు'.. 'రియల్‌' కలెక్షన్స్‌