ENGLISH

'సరిలేరు నీకెవ్వరు'.. 'రియల్‌' కలెక్షన్స్‌

14 January 2020-14:30 PM

సంక్రాంతి సినీ కోడి పుంజుల మధ్య వసూళ్ళ పందెం నడుస్తోంది. ఎవరెక్కువ.? అన్నదానికంటే, ఎవరు 'రియల్‌'.? అనే అంశం చుట్టూ రచ్చ నడుస్తోంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వసూళ్ళ వివరాలు (ఫస్ట్‌ డే) బయటకు వచ్చిన తర్వాత, 'ఎంత మంచివాడవురా' నుంచి ఆసక్తికరమైన పోస్టర్‌ బయటకొచ్చింది. అంతే, అక్కడినుంచి అసలు ఫైట్‌ షురూ అయ్యింది. 'అల వైకుంఠపురములో' గ్రాస్‌ లెక్కలు 85 కోట్లుగా చూపిస్తూ ఆ పోస్టర్‌ని విడుదల చేశారు. దానికి ధీటుగా 'సరిలేరు నీకెవ్వరు' టీమ్‌ నుంచి 103 కోట్ల రియల్‌ గ్రాస్‌.. అనే ప్రకటన వచ్చింది. కాస్సేపట్లో 'అల వైకుంఠపురములో' నుంచి 150 కోట్లు గ్రాస్‌.. అని పోస్టర్‌ వస్తుందేమో.

 

ఈ పోస్టర్ల ఫైట్‌ ఎందుకు? అనే చర్చ ఓ పక్క జరుగుతోంటే, అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు ఈ ఫైట్‌ని. నిజా నిజాలెవరిక్కావాలి.? ఫన్‌ దొరుకుతోంది కదా.! అంటూ కొందరు సినీ అభిమానులు చెబుతోంటే, ఇంకొందరు తెలుగు సినిమా పరువు తీసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేర్స్‌ పరంగా చూస్తే రెండు సినిమాలూ బాగానే వున్నాయి. వసూళ్ళ పరంగా దేనికదే భిన్నం. దేని జోనర్‌ దానిది. ఎవరి వసూళ్ళు వారికి వున్నాయి. అయితే, బడ్జెట్‌ పరంగా చూసుకున్నప్పుడు సరిలేరు, ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ అవడానికి టైమ్‌ పడుతుంది. 'అల వైకుంఠపురములో' సినిమాకి క్లీన్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చినా, 100 కోట్ల క్లబ్‌లో చేరాలంటే ఇంకాస్త ఎక్కువ దూరం పయనించాలి. మొత్తమ్మీద, ఈ ఫైట్‌ మరింత ముదిరి పాకాన పడేలానే వుంది.

ALSO READ: 'ఓబేబీ' నిర్మాత‌ల మ‌రో కొరియ‌న్ రీమేక్‌!