ENGLISH

బన్నీ, మహేష్‌.. కలవబోతున్నారా?

30 December 2019-16:44 PM

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో', మహేష్‌ హీరోగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' ఒకే రోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఇరువురి అభిమానులూ సోషల్‌ మీడియాలో అనూహ్యమైన స్థాయిలో హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాల్ని ప్రమోట్‌ చేయడం వరకూ బాగానే వుందిగానీ, వేరే హీరో సినిమాపై బురద జల్లడమే అస్సలేమీ బాగాలేదు. ఇద్దరు హీరోలూ తమ తమ సినిమాల నిర్మాణంలోనూ ఎంతో కొంత భాగం పంచుకుంటున్న విషయం విదితమే. అలా ఇద్దరూ ఒకే రోజు విడుదల కావాల్సిన తమ సినిమాని అండర్‌స్టాండింగ్‌తో ఒక రోజు గ్యాప్‌కి తీసుకొచ్చారు.

 

సో, అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఇదిలా వుంటే, అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో జరుగుతున్న యాగీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఇటు మహేష్‌, అటు అల్లు అర్జున్‌ గట్టిగానే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలుస్తారా? లేదంటే, తమ తమ సినిమాల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నుంచి అభిమానులకు స్పష్టమైన సందేశం ఇస్తారోగానీ.. ఖచ్చితంగా ఓ పోజిటివ్‌ డెవలప్‌మెంట్‌ అయితే వుంటుందని అంటున్నారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది.? సంక్రాంతి అంటే, మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పండగ చేసుకోవచ్చు. ఈ రెండు సినిమాలతోపాటుగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'ఎంత మంచివాడవురా' సినిమాతోనూ వస్తున్నాడు. అభిమానులు యాగీ చేయకపోతే, ఈ పండగ ఖచ్చితంగా హ్యాపీగానే వుంటుంది అందరికీ.

ALSO READ: బికినీ బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2019