ENGLISH

గ్లామరస్‌ రోల్స్‌కి ‘సై’ అంటున్న మాళవిక

02 October 2020-11:00 AM

మాళవిక నాయర్‌ తన తాజా చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’పై చాలా ఆశలే పెట్టుకుంది. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కళ్యాణ వైభోగమే‘, మహానటి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా ‘ఒరేయ్‌ బుజ్జిగా’తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గత మార్చిలో సినిమా విడుదల కావాల్సి వున్నా, కరోనా కారణంగా వాయిదా పడి.. చివరికి ‘ఆహా’ ద్వారా ఓటీటీ రిలీజ్‌ అవుతోంది. ‘ట్రెండ్‌ మారింది. పరిస్థితులూ మారిపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాల్సిందే’ అంటోన్న మాళవిక, ఓటీటీకి మంచి భవిష్యత్తు వుందని అభిప్రాయపడింది.

 

సినిమా హాళ్ళు మళ్ళీ తెరుచుకున్నా, ఓటీటీకి క్రేజ్‌ తగ్గకపోవచ్చంటున్న ఈ బ్యూటీ, ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాల్లో కనిపిస్తానని చెబుతోంది. ‘నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలకే మొగ్గు చూపుతాను. ఇకపై గ్లామరస్‌ రోల్స్‌లోనూ కనిపిస్తాను..’ అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పిన మాళవిక, ఓటీటీపైనా కంటెంట్‌ బేస్డ్‌ ప్రాజెక్టులు చేస్తానని అంటోంది. నటనతోపాటు దర్శకత్వంపైనా మాళవికకు ఆసక్తి వుందట. ప్రస్తుతం రెండు మూడు తెలుగు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయనీ, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాననీ అంటోంది ఈ బ్యూటీ.

 

‘గ్లామర్‌ అంటే, కేవలం ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే కాదు. అంగాంగ ప్రదర్శన కోసమే అయితే తాను గ్లామరస్‌ రోల్స్‌ చేయను’ అని స్పష్టం చేసింది మాళవిక నాయర్‌. ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో రాజ్‌ తరుణ్‌ సరసన మాళవిక హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది.

ALSO READ: థియేటర్లు ఓపెన్‌.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!