ENGLISH

మోడీతో మంచు కుటుంబం ములాఖాత్‌.

06 January 2020-12:30 PM

మంచు కుటుంబం ముందు నుంచీ బీజేపీకి స‌పోర్ట్ చేస్తూనే ఉంది. అప్ప‌ట్లో ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర‌వాత మంచు కుటుంబం మొత్తం వెళ్లి క‌లిసొచ్చింది. ఆయ‌న ఆశీర్వాదం తీసుకుంది. అప్ప‌ట్లోనే మోహ‌న్ బాబు బీజేపీలోకి చేర‌తార‌ని ప్ర‌చారం జ‌ర‌గింది. మంచు ల‌క్ష్మికి ఎంపీ సీటు ఇస్తార‌ని కూడా చెప్పుకున్నారు. కానీ... అవేం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు మ‌రోసారి మోడీని క‌లుసుకుంది మోహ‌న్ బాబు ఫ్యామిలీ. ఈరోజు ఉదయం ఢిల్లీలో ప్ర‌ధాని నివాసంలో మోడీని క‌లుసుకున్నారు మోహ‌న్ బాబు. ఆయ‌న వెంట మంచు విష్ణు, విరోనిక‌. మంచు ల‌క్ష్మికూడా ఉన్నారు. దాదాపు 34 నిమిషాల పాటు ఈ స‌మావేశం సాగింద‌ని మోహ‌న్ బాబు పీఆర్ టీమ్ స‌మాచారం అందించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#manchuvishnu #mohanbabu #viranica and #manchulakshmi met #modi

A post shared by iQlik Movies (@iqlikmovies) on

రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని, ముందే బీజేపీ తీర్థం పుచ్చుకుంటే బాగుంటుంద‌ని మోహ‌న్ బాబు కుంటుంబం డిసైడ్ అయ్యింది. అందుకే ఇలా మోడీ అప్పాయింట్‌మెంట్ తీసుకుని మ‌రీ క‌లిశారు. మ‌రి ఈ స‌మావేశం వెనుక ఏం జ‌రిగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: 'సరిలేరు..' బొమ్మ దద్దరిల్లిపోవడమే మిగిలుంది!