ENGLISH

రష్మిక లక్‌ మామూలుది కాదండోయ్‌!

06 January 2020-12:00 PM

అందాల భామ రష్మికా మండన్నాకి మెగా ప్రశంసలు దక్కాయి. లేటెస్ట్‌గా జరిగిన 'సరిలేరు నీకెవ్వరూ..' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'రష్మిక చాలా చురుకైన అమ్మాయి..' చలాకీ అమ్మాయి.. నవ్వుతూ ఉంటుంది..' అంటూ రష్మికను చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గదేంటంటే, రష్మిక చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాల ప్రీ రిలీజ్‌ ఫంక్షన్స్‌కు చిరంజీవే ముఖ్య అతిధిగా విచ్చేయడం విశేషం. తొలి సినిమా 'ఛలో'కి చిరంజీవి అతిథిగా విచ్చేశారు. తర్వాతి సినిమా 'గీత గోవిందం' అల్లు అరవింద్‌ బ్యానర్‌లో రూపొందడం వల్ల ఆ సినిమాకీ చిరంజీవే చీఫ్‌ గెస్ట్‌.

 

ఇక ముచ్చటగా మూడు ఇదిగో మహేష్‌ సినిమా.. 'సరిలేరు..'కు ఈ విధంగా వచ్చారు. ఇక్కడా రష్మికనే హీరోయిన్‌. దీన్ని చిరంజీవి తనదైన శైలిలో సరదాగా సంభాషిస్తూ, రష్మికపై ప్రశంసల జల్లు కురిపించారు. దాంతో రష్మిక మామూలు అదృష్టవంతురాలు కాదంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే రష్మికకు యూత్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. ఇక మెగాస్టార్‌ పుణ్యమా అని ఆ క్రేజ్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే, రష్మిక పాత్రకు ప్రాధాన్యత ఎక్కువే అని తెలుస్తోంది.

ALSO READ: Rashmika Mandanna Photoshoot