ENGLISH

బొద్దుగుమ్మ దీపావళి ఆనందం

19 October 2017-17:31 PM

వారెవ్వా బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌.. ఎంతందంగా ఉంది. క్రియేటివిటీ అదిరిపోయింది. దీపావళి శుభాక్షాంలు ఈ ముద్దుగుమ్మ ఇలా చెప్పింది. ఈ మధ్య కొంచెం బొద్దుగా తయారైంది. బొద్దుగా ఉన్నా బాగానే ఉందిగానీ, యంగ్‌ హీరోయిన్‌ కదా, యంగ్‌ హీరోల సరసన స్లిమ్‌గా కన్పిస్తే ఇంకా క్యూట్‌గా ఉంటుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నది వెనకటి మాట. చక్కనమ్మ చిక్కితేనే అందం అన్నది ఇప్పటి మాట. వరుసగా మూడు హిట్స్‌తో హ్యాట్రిక్‌ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దీపావళి అంటే అందరితోపాటే తనకీ ఇష్టమని, అయితే దీపావళి సందర్భంగా ఎలాంటి చేదు ఘటనలూ జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పింది. హ్యాపీ దీపావళితోపాటు సేఫ్‌ దీపావళి అనే మాటని ప్రచారం చేస్తోంది ఈ బొద్దుగుమ్మ. ఇటీవలే 'మహానుభావుడు'తో హిట్‌ కొట్టి, తాజాగా 'రాజా ది గ్రేట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ఒక రోజు ముందే పండగ వాతావరణం తెచ్చిపెట్టింది. మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. రవితేజ చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన సినిమా ఇది. టాక్‌ ఎలా ఉన్నా, పండక్కి, నవ్వులు పూయించడానికే వచ్చింది. ఆ ప్రయత్నంలో ఈ సినిమా సక్సెస్‌ అయ్యింది. దీపావళికి సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని రవితేజ అందిస్తుండగా, బ్యూటీ మెహరీన్‌ అందచందాలు కుర్రోళ్లని అలరిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముద్దుగుమ్మ మెహరీన్‌ యాక్టివ్‌గా పాల్గొంటోంది. గలగలా మాట్లాడేస్తోంది. ఇదే కాదండోయ్‌ త్వరలో మళ్లీ ఈ ముద్దుగుమ్మ 'జవాన్‌' సినిమాతో వచ్చేస్తోంది. బీ రెడీ.

ALSO READ: మహేష్ అలియాస్ భరత్ ఎప్పుడు వస్తాడో తెలుసా?