ENGLISH

గ్లామ్‌ షాట్‌: ముస్కాన్‌ గోవా అందం అదిరెన్‌

19 October 2017-17:24 PM

ఈ ఫోటోలో స్టైల్‌గా పోజిచ్చిన ఈ బ్యూటీ గుర్తుంది కదా.. తొలి సినిమాకే స్టార్‌ హీరో బాలయ్యతో జత కట్టిన ముద్దుగుమ్మ ముస్కాన్‌ సేథి. తొలి సినిమా 'పైసావసూల్‌' తర్వాత మళ్ళీ కన్పించలేదు. కానీ 'పైసావసూల్‌' సినిమాలో అమ్మడి డాన్సులు ఆకట్టుకుంటూనే ఉన్నాయి. అందం, అందానికి తగ్గ అభినయం, డాన్సింగ్‌ టాలెంట్‌ బాగానే ప్రదర్శించేసింది ఆ సినిమాతో. మంచి ఛాన్స్‌ వస్తే మళ్లీ తానేంటో నిరూపించుకుంటానంటోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం ఆమెకు బాగా ఇష్టమట. అలా దర్శక నిర్మాతల దృష్టిలో పడొచ్చంటోంది. గోవాలో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆదమరిచి ఇలా ఈ బ్యూటీ సరదాగా ఫొటోకి పోజిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే గోవా అందాలు ముస్కాన్‌ అందచందాల ముందు వెలవెలబోయాయనుకోవచ్చు.

ALSO READ: Qlik Here Musskan Sethi Hot Gallery