ENGLISH

క్యూట్‌ క్యూట్‌గా కొల్లగొట్టేస్తోంది

18 November 2017-18:50 PM

నాగ శౌర్య హీరోగా వస్తోన్న కొత్త చిత్రం 'ఛలో'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. బస్సు దిగి ఓ ఊరులోకి హీరో ప్రవేశిస్తున్నట్లుగా ఉంది ఆ లుక్‌. ప్యాక్షన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో సినిమా తెరకెక్కబోతోందనే ఫీలింగ్‌ ఆ ఫస్ట్‌లుక్‌ ద్వారా కలిగించారు. ఓ ఊరు.. ఎంట్రన్స్‌ ఆర్చ్‌..చాలా ఆశక్తికరంగా డిజైన్‌ చేశారు. అయితే తాజాగా మరికొన్ని లుక్స్‌ ఈ సినిమాకి సంబంధించి హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ తాజా లుక్స్‌ చూస్తుంటే సినిమా ఓ క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలా అనిపిస్తోంది. అన్ని లుక్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్‌ చేశారు. ఈ లుక్స్‌లోని రొమాంటిక్‌ ట్రాక్‌ అదిరిపోతోంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు లుక్‌లా ఓ లుక్‌ ఉంటే, కాలేజీలో లవ్‌ మూమెంట్‌లా అనిపిస్తోంది మరో లుక్‌. హీరోయిన్‌ క్యూట్‌గా కళ్లజోడు పెట్టుకుని చిలిపి పోజులో భలే ఎట్రాక్ట్‌ చేస్తున్నట్లుగా ఉంది మరో లుక్‌. 

ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ముద్దుగుమ్మని పరిచయం చేయలేదు కదా. అమ్మడి పేరు రష్మికా మండన్నా. కన్నడ పోరి. కన్నడలో 'కిరిక్‌ పార్టీ' సినిమాతో పాపులర్‌ అయ్యింది. ఈ బ్యూటీ తెలుగులో ఎంట్రీ ఇవ్వకుండానే సెన్సేషన్‌ అయిపోయింది తెలుసా! అల్లు అర్జున్‌ తదితర స్టార్స్‌తో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ ఆ మధ్య గాసిప్స్‌ తెగ గుప్పుమన్నాయిలెండి. ఆ ముద్దుగుమ్మే ఈ ముద్దుగుమ్మ. తాజాగా నాగశౌర్య సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఎంట్రీ మామూలుగా లేదండోయ్‌. ఇదిగో ఇలా పోస్టర్స్‌ నిండా ఈ ముద్దుగుమ్మే. భలే క్యూట్‌గా ఉందిలెండి. స్టైలిష్‌ అప్పియరెన్స్‌ కూడా. అదీ సంగతి. వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ ఈ రోజు సాయంత్రం 7.30 కి విడుదల చేయనుంది చిత్ర యూనిట్‌. పోస్టర్సే ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే, టీజర్‌ ఇంకేం చేస్తుందో చూడాలి మరి.

ALSO READ: AP స్పెషల్ స్టేటస్ పైన ప్రకాష్ రాజ్ స్పందన